HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pv Sindhu Enters Bac Semifinals And Confirms Medal

PV Sindhu: ‘ఆసియా ఛాంపియన్ షిప్’ లో సెమీస్ కు సింధూ!

తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధు ఆసియా ఛాంపియన్ షిప్ లో దుమ్మురేపుతోంది.

  • Author : Hashtag U Date : 30-04-2022 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sindhu
Sindhu

తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధు ఆసియా ఛాంపియన్ షిప్ లో దుమ్మురేపుతోంది. ఇందులో సెమీఫైనల్స్ కు వెళ్లింది. ఈ టోర్నీకి ప్రపంచ బ్యాడ్మింటన్ లో చాలా ఎక్కువ పోటీ ఉంటుంది. అయినా సరే సింధు బాగా ఆడుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని కొట్టిన తరువాత సింధు.. మళ్లీ మెరుస్తోంది. అందుకే ఈసారి కచ్చితంగా పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ లో సింధు ఆటతీరును చూడాల్సిందే. అందులో అయిదో సీడ్ లో చైనాకు చెందిన హి బింగ్జియావోపై గెలవడంతో సింధు ఆనందానికి హద్దులు లేవు. సింధుకు ఆసియా ఛాంపియన్ షిప్ లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కాదు. 2014లో జిమ్ చన్ ఆసియా ఛాంపియన్ షిప్ లో సింధు ఫస్ట్ టైమ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

జపాన్ చెందిన యమగూచి తో సింధుకు పోటీ ఉంది. శనీవారం జరిగే సెమీస్ లో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ సెమీస్ లో గెలిస్తే యాసియా టోర్నీలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపించిన షట్ల ర్ గా రికార్డు సాధిస్తుంది సింధు. ఇంతకుముందు సైనా నెహ్వాల్.. 2010లో ఢిల్లీలో, 2016లో వూహాన్ లో, 2018లో వూహాన్ లో జరిగిన పోటీల్లో మూడూసార్లు కాంస్యాలకే పరిమితం అయ్యింది. అందుకే ఆ రికార్డును సింధు బద్దలుకొడుతుందేమో చూడాలి. ఆసియా టోర్నీలో ఇప్పటివరకు మనవాళ్లు 9 పతకాలు సాధించారు. అందులో ఒక గోల్డ్ మెడల్, ఒక రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆ స్వర్ణం కూడా 1965లో దినేశ్ కుమార్ ఖన్నా సాధించిందే. ఇక కాంస్యాలు తెచ్చినవారిలో ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు ఉన్నారు. 1983లో ప్రకాశ్, సయ్యద్ మోదీలు రజత పతకాన్ని అందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia
  • badminton player
  • PV Sindhu
  • sports

Related News

Krishna JayaShankar

Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

ఒకప్పుడు “లావుగా ఉన్నావు” అంటూ బాడీ షేమింగ్‌కు గురైన చెన్నైకి చెందిన యువ అథ్లెట్ కృష్ణ జయశంకర్ నేడు భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల షాట్‌పుట్ విభాగంలో కృష్ణ జయశంకర్ 17.35 మీటర్ల దూరం షాట్‌ను విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన క‌న‌బ‌రిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

Latest News

  • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

  • Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd