PM Modi : జాతీయ క్రీడల దినోత్సం ..క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
జాతీయ క్రీడల దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈమేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు.
- By Latha Suma Published Date - 01:21 PM, Thu - 29 August 24

National Sports Day : నేడు జాతీయ క్రీడల దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈమేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లతో సంభాషించిన వీడియో అందులో ఉంది. ”భారత్ కోసం క్రీడల్లో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి అభినందనలు చెప్పేందుకు ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి ఉండదు. మా ప్రభుత్వం క్రీడలకు మద్దతుగా నిలుస్తూ.. యువతకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. తమకిష్టమైన క్రీడల్లో రాణించేలా అండగా నిలుస్తాం” అని మోడీ వెల్లడించారు.
Greetings on National Sports Day. Today we pay homage to Major Dhyan Chand Ji. It is an occasion to compliment all those passionate about sports and those who have played for India. Our Government is committed to supporting sports and ensuring more youth are able to play and… pic.twitter.com/nInOuIOrpp
— Narendra Modi (@narendramodi) August 29, 2024
We’re now on WhatsApp. Click to Join.
”మరోవైపు మన జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా అథ్లెట్లు, కోచ్‌లతోపాటు ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. క్రీడలనే తమ జీవితంగా మార్చుకున్నవారికి అంకితం. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవాలి. అంతర్జాతీయంగా క్రీడల్లో భారత్‌ను శక్తివంతంగా మారుద్దాం”- జైషా, బీసీసీఐ కార్యదర్శి
కాగా..”క్రీడలు ఎంత ముఖ్యమో ఈ రోజును చూస్తే అర్థమవుతోంది. హాకీ ప్లేయర్‌గా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ఇవాళ్టి రోజును జాతీయ క్రీడల దినోత్సవంగా సెలబ్రేషన్ చేయడం గర్వంగానూ ఫీలవుతున్నా. ఏ క్రీడనైనా ఇష్టంగా ఆడితే విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. మీరు ఆస్వాదించలేకపోతే అది క్రీడగా కాకుండా ఓ వ్యాపారంగా భావిస్తారు. ప్రాథమిక అంశాలను నేర్చుకోవడంపై ఎక్కువ సమయం వెచ్చించాలి. కఠినమైన సాధన చేయాలి” – శ్రీజేశ్, భారత జూనియర్ హాకీ టీమ్ కోచ్
”కుమారుడిగా తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం దక్కడం అద్భుతం. ఆయన ప్రభావం దేశమొత్తం వ్యాపించి ఉంది. హాకీలో కొత్త సంప్రదాయాలకు నాంది పలికారు. ఆటగాడిగా, సైనికుడిగా, తండ్రిగా.. ఎన్నో పాత్రలను చక్కగా పోషించారు. ఈ క్షణం నాకెంతో గర్వంగా ఉంది. ధ్యాన్‌చంద్ విగ్రహావిష్కరణకు సాయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు”- ఒలింపియన్ అశోక్ కుమార్, ధ్యాన్‌చంద్ కుమారుడు
Read Also: Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!