Preity Zinta: అర్జున్ టెండూల్కర్ కి సపోర్టుగా నిలిచిన సొట్టబుగ్గల సుందరి
సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాది ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్ లోనే వికెట్ తీసి ఫర్వాలేదనిపించాడు
- By Praveen Aluthuru Published Date - 05:32 PM, Wed - 26 April 23

Preity Zinta: సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాది ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్ లోనే వికెట్ తీసి ఫర్వాలేదనిపించాడు. కానీ సెకండ్ మ్యాచ్ లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఒక వికెట్ తీసి భారీగా పరుగులు సమర్పించాడు. 1 ఓవర్లోనే 30కి పైగా పరుగులు ఇచ్చి నిరాశకు గురి చేశాడు. దీంతో సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీమ్స్ దాడి ఎక్కువైంది. ఈ క్రమంలో అర్జున్ కు కొందరు మద్దతిస్తున్నారు. తాజాగా అర్జున్ టెండూల్కర్ పై వస్తున్న విమర్శలపై స్పందించారు ప్రీతిజింతా.
ప్రీతీ జింటా మాట్లాడుతూ.. అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అతను బలమైన పునరాగమనం చేస్తాడని నేను భావిస్తున్నాను. మునుముందు అంతా బాగానే ఉంటుంది అంతా మంచి జరుగుతుంది. అతను ట్రోల్స్ కి సమాధానమిస్తాడు. త్వరలోనే అతనిపై ట్రోల్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది అంటూ అర్జున్ కి సపోర్టుగా నిలిచింది. తప్పులు చేయని వాడు ఎప్పటికీ నేర్చుకోలేడు. ఏది జరిగినా అది మంచికే జరిగింది అంటూ పేర్కొంది ప్రీతిజింతా.
2023 ఐపీఎల్ హోరాహోరీగా సాగుతుంది. చివరి ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. బ్యాట్స్ మెన్స్ విజ్రంభిస్తుంటే, బౌలర్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో మ్యాచ్ చివరి వరకు సాగుతుంది. ఈ సీజన్ ఐపీఎల్ పై ప్రేక్షకుల్లోనూ ఎక్కడలేని క్యూరియాసిటీ కనిపిస్తుంది.
Read More: Samantha Temple: సమంతకు గుడి కట్టిన అభిమాని.. ఎందుకో తెలుసా!