HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Palash Muchhal Hospitalised

Smriti Mandhana : స్మృతి మంధాన కు మరో షాక్..నిన్న తండ్రి , నేడు ప్రియుడు

Smriti Mandhana : టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుకలో ఊహించని షాకింగ్ ఘటనలు ఎదురవుతున్నాయి.

  • Author : Sudheer Date : 24-11-2025 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Palash Muchhal Hospitalised
Palash Muchhal Hospitalised

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుకలో ఊహించని షాకింగ్ ఘటనలు ఎదురవుతున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారం రోజులుగా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతుండగా, ఆదివారం జరగాల్సిన వివాహం అర్ధంతరంగా వాయిదా పడింది. దీ పెళ్లికి కొద్దిసేపటి ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్లు స్మృతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ అకస్మాత్తు పరిణామంతో పెద్ద ఎత్తున చేసిన వివాహ ఏర్పాట్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి.

Sivaji : చిత్రసీమలో ఆ ముగ్గురే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు – శివాజీ సంచలన వ్యాఖ్యలు

దురదృష్టవశాత్తూ, అదే సమయంలో మరో ఆందోళనకరమైన వార్త కూడా స్మృతి కుటుంబానికి చేరింది. పెళ్లి కుమారుడు పలాష్ ముచ్చల్ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా క్షీణించడంతో, అతన్ని కూడా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. పలాష్‌కు వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు తీవ్రమైన జీర్ణ సమస్యలు (డైజషన్ ప్రాబ్లమ్స్) వచ్చాయి. అయితే పలాష్ పరిస్థితి అంత ప్రమాదకరంగా ఏమీ లేదని నిర్ధారణ కావడంతో, తక్షణ వైద్య చికిత్స అనంతరం అతన్ని డిశ్చార్జ్ చేశారు. అనంతరం అతను వెడ్డింగ్ హోటల్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ రెండు సంఘటనలు స్మృతి కుటుంబంలో ఒక రోజులోనే తీవ్ర ఆందోళన కలిగించాయి.

స్మృతి తండ్రి ఆరోగ్యంపై కుటుంబ వైద్యుడు డాక్టర్ నమన్ షా కీలక వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్ మంధానాకు ఎడమ వైపున వచ్చిన ఛాతీ నొప్పిని వైద్యపరంగా ‘ఆంజైనా’ అని పిలుస్తామని ఆయన వివరించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత జరిపిన ECG మరియు ఇతర పరీక్షల్లో కార్డియాక్ ఎంజైమ్‌లు పెరిగినట్లు గుర్తించామని, అందువల్ల ఆయన్ను నిరంతర పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉందని డాక్టర్ షా తెలిపారు. పరిస్థితి మరింత క్లిష్టంగా మారితే యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుందని కూడా వైద్యులు పేర్కొన్నారు. శ్రీనివాస్ మంధానా పూర్తిగా కోలుకున్న తర్వాతే కొత్త వివాహ తేదీని ఖరారు చేస్తామని, ఈ పరిస్థితులు అన్నీ చక్కబడే వరకు పెళ్లి గురించి ఆలోచించబోమని స్మృతి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • battled a viral infection
  • Palash Muchhal
  • Palash Muchhal Hospitalised
  • Smriti Mandhana
  • smriti mandhana father. hospital
  • Smriti Mandhana wedding

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd