Vinesh Phogat: పీటీ ఉషపై వినేష్ సంచలన ఆరోపణలు
వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ 2024లో చాలా బలమైన ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ జరిగే ఉదయం ఆమెపై అనర్హత వేటు పడింది.
- By Gopichand Published Date - 04:49 PM, Wed - 11 September 24

Vinesh Phogat: 2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హత వేటు పడిన వినేష్ ఫోగట్ (Vinesh Phogat) రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యారు. అయితే వినేష్ క్రీడా ప్రపంచాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. వినేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఇంతలో ఆమె ఒక పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇందులో వినేష్ పిటి ఉష (PT Usha)పై ఆరోపణ చేసింది. ఉష విషయంలో వినేష్ ఏం ఆరోపణలు చేసిందో తెలుసుకుందాం.
ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. వినేష్ ఫోగట్ పిటి ఉష గురించి ప్రస్తావించింది. నేను పారిస్ ఒలింపిక్స్ 2024 సందర్భంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు పిటి ఉషా మేడమ్ వచ్చింది. అప్పుడే అక్కడున్న వ్యక్తి ఫోటో క్లిక్ చేసాడు. పీటీ ఉష నాతో మాట్లాడలేదు. ఆ సమయంలో నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. అది నాకు మాత్రమే తెలుసు. అక్కడ రాజకీయం నడిచింది. ప్రతిచోటా రాజకీయం ఉంది. చెప్పాపెట్టకుండా ఫోటో తీసి ప్రపంచానికి చూపించడానికే ఇదంతా చేశారని ఆమె ఆరోపణలు చేసింది.
Also Read: Caste Enumeration : మెగా కుల గణనకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం
వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ 2024లో చాలా బలమైన ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ జరిగే ఉదయం ఆమెపై అనర్హత వేటు పడింది. వాస్తవానికి వినేష్ 50 కిలోల ఫ్రీస్టైల్ మహిళల రెజ్లింగ్ ఈవెంట్‌లో పాల్గొంది. ఫైనల్‌కు ముందు వినేష్ బరువు నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉంది. దీని కారణంగా ఆమెపై అనర్హత వేటుపడింది.
వినేష్‌తో కలిసి బజరంగ్ రాజకీయాల్లోకి వచ్చాడు
రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇద్దరూ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈసారి వినేష్‌కు టికెట్ దక్కగా.. భజరంగ్‌కు టికెట్ దక్కలేదు. జంతర్ మంతర్ వద్ద నిరసన అనంతరం వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. నిరసన సందర్భంగా వినేష్, బజరంగ్, సాక్షి.. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ తరపున హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన వినేష్.. జులనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది.