India vs Australia 2nd Test : మరోసారి ఆదుకున్న నితీశ్ రెడ్డి
India vs Australia 2nd Test : తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి 54 బంతుల్లో 42 పరుగులు చేసి, భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. 3 సిక్సులు, 3 ఫోర్లు కొట్టిన నితీశ్ జట్టుకు అత్యధిక స్కోర్ అందించారు. స్వింగ్ అవుతున్న బంతులకు ఇతర బ్యాటర్లు బలవుతుంటే, నితీశ్ ధైర్యంగా ఆడడం విశేషం
- By Sudheer Published Date - 02:58 PM, Fri - 6 December 24

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ (India vs Australia 2nd Test) 180 పరుగులకే ఆలౌటైంది. పింక్ బాల్ స్వింగ్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు చక్కగా ఉపయోగించుకొని భారత టాప్ బ్యాటర్లను తొందరగా పెవిలియన్‌కు పంపారు. రోహిత్, కోహ్లి, జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా విఫలమవడంతో భారత ఇన్నింగ్స్ సంకటంలో పడింది. గిల్ (31), రాహుల్ (37), అశ్విన్ (22), పంత్ (21) తక్కువ పరుగులు చేసినా, ఆది నుంచి చివరి వరకు నిలదొక్కుకున్న ఒక్క ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డే (Nitish Reddy ).
తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి 54 బంతుల్లో 42 పరుగులు చేసి, భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. 3 సిక్సులు, 3 ఫోర్లు కొట్టిన నితీశ్ జట్టుకు అత్యధిక స్కోర్ అందించారు. స్వింగ్ అవుతున్న బంతులకు ఇతర బ్యాటర్లు బలవుతుంటే, నితీశ్ ధైర్యంగా ఆడడం విశేషం. అతని ఆటతీరును చూస్తే భారత్ కు సరైన ఆల్రౌండర్ దొరికినట్లే అనిపిస్తోంది. నితీశ్ ప్రదర్శనపై నెట్టింట ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నితీశ్ రెడ్డి భవిష్యత్తులో భారత జట్టుకు మంచి ఆల్రౌండర్‌గా మారతాడనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది. బౌలింగ్‌లో కూడా మెరుపులు చూపగల నితీశ్, రెండో ఇన్నింగ్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాడని ఆశిద్దాం.
ఆసీస్ బౌలర్ల జోరు :
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను చీల్చి చెండాడాడు. కమిన్స్, బొలాండ్‌లు రెండేసి వికెట్లు తీసి భారత్‌ను భారీ స్కోరు సాధించకుండా అడ్డుకట్ట వేశారు. స్టార్క్ వేసిన యార్కర్లు, కమిన్స్ పంపించిన కటర్స్ భారత బ్యాటర్లకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇక భారత బౌలర్ల ముందు ఇప్పుడు భారీ బాధ్యత ఉంది. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ బ్యాటింగ్‌ను త్వరగా ఆలౌట్ చేయడమే భారత జట్టు విజయావకాశాలకు కీలకం. బుమ్రా, సిరాజ్, అశ్విన్‌లు తమ కెరియర్‌లో కీలక స్పెల్‌లు వేయాల్సిన సమయం ఇదే.
Nitish Reddy might actually be HIM
Unreal mentality and excellent composure under pressure from the young lad… India needed someone like him badly#INDvsAUS #NitishKumarReddypic.twitter.com/Yyb1kYApOU
— Shikhar (@SharkVintage_) December 6, 2024
Read Also : Sobhita- Naga Chaitanya: శ్రీశైలం మల్లన్న సేవలో శోభిత, నాగ చైతన్య