Srilanka Asia Cup: లంక చేతిలో పాకిస్థాన్ చిత్తు
ఆసియాకప్ 2022 ప్రీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. హసరంగ ధాటికి పాక్ బ్యాటర్లు క్రీజులో నిలువలేక పోయారు.
- By Naresh Kumar Published Date - 11:15 PM, Fri - 9 September 22

ఆసియాకప్ 2022 ప్రీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. హసరంగ ధాటికి పాక్ బ్యాటర్లు క్రీజులో నిలువలేక పోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభం నుంచే తడబడింది. లంక అరంగేట్ర పేసర్ ప్రమోద్.. పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేయడంతో ఆత్మ రక్షణలో పడిన పాక్ నిదానంగా ఆడింది. తర్వాత స్పిన్నర్లు చెలరేగడంతో పాక్ కోలుకోలేదు.
తన వరుస ఓవర్లలో కుష్దిల్ , ఇఫ్తికర్ అహ్మద్, అసిల్ అలీలను హసరంగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత తీక్షణ కూడా విజృంభించడంతో పాక్
పాకిస్థాన్ 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇతర బౌలర్లలో మహీశ్ తీక్షణ2, ప్రమోద్ మదుషన్ 2 రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.
స్వల్ప లక్ష్యమే అయినా లంక కూడా తడబడింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కుషాల్ మెండీస్ , గునలతిక , దిసిల్వ ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే ఓపెనర్ నిస్సంక పాక్ కు అవకాశం ఇవ్వలేదు. రాజపక్స తో కలిసి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో శనక కూడా రాణించడంతో లంక మరో మూడు ఓవర్లు మిగిలి వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రెండు జట్ల మధ్య ఫైనల్ ఆదివారం జరుగుతుంది.