Nicholas Pooran: మహ్మద్ రిజ్వాన్ రికార్డు బద్దలు.. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్..!
వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడిన పురన్ ఈ ఏడాది 14 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని బ్యాట్ నుండి 152 సిక్సర్లు కూడా వచ్చాయి.
- By Gopichand Published Date - 10:10 AM, Mon - 30 September 24

Nicholas Pooran: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 2021లో టీ20 క్రికెట్‌లో సందడి చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు అయినా, లీగ్ క్రికెట్ అయినా, ఆ ఏడాది ఎక్కడ చూసినా రిజ్వాన్ బ్యాట్ విపరీతంగా రాణించింది. దీని కారణంగా అతను ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక T20 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును సృష్టించాడు. అయితే ఈ రికార్డు మూడేళ్లకు పైగా అతని పేరు మీద నిలిచిపోయింది. తాజాగా ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడిన విండీస్ పేలుడు బ్యాట్స్‌మెన్ ఆ రికార్డును బద్దలుకొట్టాడు.
మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన వ్యక్తి మరెవరో కాదు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran). కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పురాన్ ఈ చరిత్ర సృష్టించాడు. పురాణ్ సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ 2021లో 45 ఇన్నింగ్స్‌లలో 56.55 సగటు, 132.03 స్ట్రైక్ రేట్‌తో 2036 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం నికోలస్ పురాన్ 65 ఇన్నింగ్స్‌లలో 42.02 సగటుతో.. 160.85 స్ట్రైక్ రేట్‌తో 2059 పరుగులు చేసి తన పేరిట ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Also Read: IRE vs SA 2nd T20: సౌతాఫ్రికాపై గెలిచి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడిన పురన్ ఈ ఏడాది 14 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని బ్యాట్ నుండి 152 సిక్సర్లు కూడా వచ్చాయి. ఇది ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ప్రపంచ రికార్డు.
ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. హేల్స్ 2022లో 61 ఇన్నింగ్స్‌లలో 34.14 సగటుతో, 155.68 స్ట్రైక్ రేట్‌తో 1946 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో పాటు నికోలస్ పూరన్ ఈ ఏడాది T20 క్రికెట్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్, లక్నో సూపర్ జెయింట్స్, MI ఎమిరేట్స్, MI న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్‌పూర్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడాడు.