News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Nicholas Pooran Appointed West Indies Mens Odi And T20i Captain

Nicholas Pooran :విండీస్ కెప్టెన్ గా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్

వెస్టిండీస్ జట్టు సారథి కీరన్‌ పొలార్డ్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

  • By Naresh Kumar Published Date - 12:54 PM, Wed - 4 May 22
Nicholas Pooran :విండీస్ కెప్టెన్ గా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్

వెస్టిండీస్ జట్టు సారథి కీరన్‌ పొలార్డ్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా పోలార్డ్ స్థానంలో ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్‌ పూరన్‌ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్‌ 2022తో పాటు, 2023 వన్డే వరల్డ్ కప్‌ ముగిసే వరకు వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక నికోలస్ పూరన్‌ 2016లో వెస్టిండీస్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయగా.. ఇప్పటివరకు 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టీ ట్వంటీల్లో 1193 పరుగులు సాధించాడు.

వన్డేల్లో ఒక సెంచరీ, 8 ఆఫ్ సెంచరీలు ఉండగా.. టీ ట్వంటీల్లో 8 ఆఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న నికోలస్ పూరన్‌ను సన్ రైజర్స్ హైదరాబద్ ఫ్రాంచైజీ మెగావేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. పంజాబ్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరన్ విధ్వంసకర ఆటతీరుతో దుమ్మురేపుతున్నాడు. తాజాగా పూరన్‌కు వెస్టిండీస్ కెప్టెన్‌గా అవకాశం రావడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags  

  • Nicholas Pooran
  • ODI
  • T20
  • West Indies captain

Related News

South Africa T20: ఐపీఎల్ తరహాలో మ‌రో టోర్నీ

South Africa T20: ఐపీఎల్ తరహాలో మ‌రో టోర్నీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నా ఐపీఎల్ మెగా టోర్నీ మాదిరిగా మ‌రో టీ20 లీగ్ ను ప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడిందింది.

  • Virat Kohli T20 in doubt: కోహ్లీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

    Virat Kohli T20 in doubt: కోహ్లీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. వేదిక‌లు ఖరారు..!!

    IND vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. వేదిక‌లు ఖరారు..!!

  • SRH Victory: సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో… వరుసగా నాలుగో విజయం

    SRH Victory: సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో… వరుసగా నాలుగో విజయం

  • SRK tames GT: కేన్ మామ అదుర్స్…గుజరాత్ టైటాన్స్ బెదుర్స్..!!

    SRK tames GT: కేన్ మామ అదుర్స్…గుజరాత్ టైటాన్స్ బెదుర్స్..!!

Latest News

  • High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

  • Akhil: ‘ఏజెంట్స్’ పై రూమర్స్.. మేకర్స్ క్లారిటీ!

  • Beer Sales: బీరు జోరు.. రికార్డుస్థాయిలో సేల్స్!

  • SSC exams: నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు

  • CM KCR : కేసీఆర్‌ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ షురూ

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: