HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ms Dhonis New Moustache Look In The Star Sports Teaser

MS Dhoni: నయా లుక్‌లో ధోనీ

  • Author : Naresh Kumar Date : 27-02-2022 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ms Dhoni
Ms Dhoni

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్‌ ధోని కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుల్ మాస్ లుక్ లో ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్‌ తిన్నారు. ఇక మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్‌ 2022 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే ధోనీ.. రాంచి మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.. ఊర మాస్ లుక్ ఉన్న ధోని ఫోటోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సంస్థ స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్‌లో షేర్ చేసింది.

నిజానికి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అతని ఆట కంటే జులపాల జుట్టు గురించే ఎక్కువగా చర్చ జరిగింది.. ఆ తర్వాత 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేసుకున్న ధోనీ.. ఐపీఎల్‌ 2020కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ముంగిట ధోనీ సన్యాసి అవతారంలో కూడా కనువిందు చేశాడు.. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఊర మాస్ లుక్ లో మహేంద్రుడు దర్శనమిచ్చాడు.. ఇక ధోని సరికొత్త లుక్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ లుక్ లో కూడా ధోని ఫుల్ స్టైలిష్ గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఎంఎస్ ధోనీ తన కెరీర్ లో 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు.అలాగే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి నాలుగు టైటిళ్లు అందించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • CSK
  • IPL
  • ms dhoni
  • Thalaivar

Related News

Rajasthan Royals

ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో ఈ విజయానికి వైభవ్ సూర్యవంశీ హీరోగా నిలిచారు.

  • Rohit Sharma

    ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • IPL 2026

    నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

  • Vijay Mallya Critics Who Laughed at His RCB Investment

    Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

  • Rajasthan Royals

    రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

Latest News

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd