MS Dhoni : కూతురు జీవాతో కలిసి ఫాంహౌస్‌లో పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్ 2023 టోర్నీ తరువాత మోకాలికి సర్జరీ చేయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తొలిసారి తన కుమార్తె జీవాతో కలిసి రాంచీలోని ఫామ్‌హౌస్‌లో పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Author : News Desk
Date : 24-06-2023 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ధోనీ మోకాలి సర్జరీ (Dhoni knee surgery) తరువాత ధోనీ కుమార్తె జీవా (Dhoni daughter Ziva)తో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంచీలోని ఫామ్‌హౌస్‌లో పెంపుడు కుక్కలతో ధోని, అతని కుమార్తె జీవా ఆడుకుంటున్న వీడియోను ధోనీ భార్య సాక్షి సింగ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ధోనీ, జీవా తమ పెంపుడు కుక్కలకు బంతులు విసురుతూ, వాటితో ఆడుకుంటూ పరుగెడుతూ కనిపించారు.
ఐపీఎల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహించారు. మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ధోనీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడిన సందర్భాలు కనిపించాయి. పలుసార్లు ధోనీ మైదానాన్ని వీడాడు. అయినా, ధోనీ చివరి మ్యాచ్ వరకు ఆడుతూ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలపడంలో కీలక భూమిక పోషించారు. దీంతో ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదవ సారి టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత ధోని ముంబై వెళ్లి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత, ధోని తన స్థానిక స్నేహితులతో కొంత సమయం గడిపినట్లు కనిపించాడు, దాని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.