Siraj : సిరాజ్ గొప్ప మనసు.. తనకి వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేసి..
కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
- Author : News Desk
Date : 17-09-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా(Team India) ఆసియా కప్(Asia Cup) ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను(Srilanka) దారుణంగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఆసియా కప్ ని గెలుచుకుంది. మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం మహ్మద్ సిరాజ్. మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) బౌలింగ్ ధాటికి లంక బ్యాటర్లు వణికిపోయారు. మ్యాచ్ లో ఏకంగా ఆరు వికెట్లు తీసి ఇండియాకి విజయాన్ని ఈజీగా అందించాడు సిరాజ్.
దీంతో ఇవాళ సిరాజ్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి అంతా సిరాజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి ప్రైజ్ మనీ కింద 4 లక్షల రూపాయలు ఇచ్చారు.
అయితే సిరాజ్ మాత్రం తనకి వచ్చిన మొత్తం ప్రైజ్ మనీని ఆ స్టేడియంలోని శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్ కి ఇచ్చేశాడు. అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. ఇదంతా ఒక కలలా ఉంది. ఈ రోజు పిచ్ ఎక్కువ స్వింగ్ కి అనుకూలించింది. దీంతో ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. గ్రౌండ్ మెన్స్ లేకుండా ఈ టోర్నీ సాధ్యం అయ్యేది కాదు. వాళ్ళ కష్టానికి గుర్తింపుగా నాకు వచ్చిన ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని వారికి ఇచ్చేస్తున్నాను అని తెలిపాడు. దీంతో మరోసారి సిరాజ్ ని అందరూ పొగిడేస్తూ అభినందిస్తున్నారు. ఇక సిరాజ్ మన హైదరాబాద్ కుర్రాడు కావడం విశేషం.
Siraj dedicates his Player Of The Match award and cash prize to the Sri Lankan groundstaff 🫡❤️#AsiaCupFinal #AsianCup2023 #Siraj #INDvSL #IndiavsSrilanka #AsiaCupFinals #INDvsSL pic.twitter.com/NUAnFTu0pD
— vicky bhai (@MahakBk) September 17, 2023
Also Read : IND vs SL: ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్