NZ vs Pak: న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ బౌలర్ దూరం?
NZ vs Pak: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ చేతి గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
- By Nakshatra Published Date - 07:49 PM, Sat - 8 October 22
NZ vs Pak: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ చేతి గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా.. కివీస్ జట్టుకు మరో స్టార్ బౌలర్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ గాయం కారణంగా అన్నీ మ్యాచ్‌లకు దూరమవుతున్నట్లు న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు.
ఈ కివీస్ బౌలర్ ఇప్పటివరకు 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 32 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ ఈనెల 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ జట్టుకు ఫెర్గూసన్ బౌలింగ్ లో కీలకమైన ప్లేయర్. దురదృష్టవశాత్తు అతడు గతేడాది గాయంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడని అన్నారు. ఇప్పడు మొత్తం ట్రై-సిరీస్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత గాయం నుంచి కోలుకోకపోతే టీ20 వరల్డ్‌కప్‌కు దూరం కావచ్చాని తెలిపారు.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రాస్‌వెల్, మార్క్ చంపమాన్, దేవాన్ కాన్వె (వికెట్ కీపర్), లూకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, డార్లీ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఇస్ సోధి, టిమ్ సౌథీ.
Related News
RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్.. ప్లేఆఫ్ అవకాశాలు
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.