HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mi Skipper Rohit Sharma Given Out In A Controversial Decision

IPL 2022 : ఇదేం అంపైరింగ్…రోహిత్ ఔట్ పై తీవ్ర దుమారం

ఐపీఎల్ 15వ సీజన్ లో అంపైరింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లీగ్ స్టేజ్ ఫస్ట్ హాఫ్ లో వైడ్ వివాదాలు తలెత్తితే ఇప్పుడు క్యాచ్ ఔట్ లు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. అది కూడా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కోల్ కత్తా, ముంబై మ్యాచ్ లో తీవ్ర దుమారం రేపింది.

  • Author : Naresh Kumar Date : 10-05-2022 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohith Sharma
Rohith Sharma

ఐపీఎల్ 15వ సీజన్ లో అంపైరింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లీగ్ స్టేజ్ ఫస్ట్ హాఫ్ లో వైడ్ వివాదాలు తలెత్తితే ఇప్పుడు క్యాచ్ ఔట్ లు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. అది కూడా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కోల్ కత్తా, ముంబై మ్యాచ్ లో తీవ్ర దుమారం రేపింది. సాంకేతిక లోపం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. రోహిత్​ శర్మను థర్డ్​ అంపైర్​ ఔట్​గా ప్రకటించడంతో ముంబై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్​ శర్మ తొలి ఓవర్​ 6వ బంతికి ఔట్​ అయ్యాడు. రోహిత్​ శర్మ బ్యాట్​ ఎడ్జ్​కు సమీపం నుంచి బాల్​ వెళ్లి అతని థైప్యాడ్​కు తగిలి గాలిలో లేచింది. షెల్డన్​ జాక్సన్​.. కళ్లుచేదిరే రీతిలో క్యాచ్​ అందుకున్నాడు. కానీ అంపైర్​ దానిని ఔట్​ ఇవ్వలేదు. జాక్సన్​ విజ్ఞప్తి మేరకు కేకేఆర్​ సారథి శ్రేయస్​ అయ్యర్​.. రివ్యూ తీసుకున్నాడు. అప్పుడే వివాదం రాజుకుంది.

థర్డ్​ అంపైర్​ అల్ట్రా ఎడ్జ్​ను పరిశీలించారు. రోహిత్​ బ్యాట్​కు బాల్​ సమీపంలో ఉన్నప్పుడు స్నికోమీటర్​లో స్పైక్స్​ కనిపించాయి. అయితే.. దానికన్నా ముందు.. అసలు బంతి బ్యాట్​కు దగ్గర్లో కూడా లేకముందే స్నికోమీటర్​లో స్పైక్స్​ దర్శనమిచ్చాయి. ఈ విషయం టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే రోహిత్​ను థర్డ్​ అంపైర్​ బ్రూస్​ అక్స్​ఫర్డ్​ ఔట్​గా ప్రకటించడం, అసంతృప్తితో హిట్​మ్యాన్​ పెవీలియన్​కు చేరడం నిమిషాల్లో జరిగిపోయింది. ఐపీఎల్​లో అంపైరింగ్​, అంపైర్​ నిర్ణయాలపై ఇప్పటికే అసంతృప్తి నెలకొన్న తరుణంలో.. రోహిత్​ ఔట్​పై మరోమారు దుమారం రేగింది. అంపైరింగ్​పై రోహిత్​ ఫ్యాన్స్​.. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మంచి అంపైర్లను తీసుకురావాలని బీసీసీఐ, ఐపీఎల్​ను కోరుతున్నాను. ఇలాంటి చెత్త అంపైరింగ్​తో ప్లేయర్లు నష్టపోతున్నారు. ఏదో ఒకరోజు ఐపీఎల్​ ఫైనల్​లో ఇలాంటిదే జరిగితే.. రసవత్తర పోరులో లాస్ట్​ బాల్​కి ఇలా జరిగితే అని ఓ వ్యక్తి ట్వీట్​ చేశాడు. ఎవరైనా ఆ అంపైర్లకు కళ్లజోడును విరాళంగా ఇవ్వండి రా బాబు అని ఇంకో ముంబై ఫ్యాన్​ అన్నాడు. కళ్లు తెరిచి అంపైరింగ్​ చేయండి అంటూ మరో వ్యక్తి ఎద్దేవా చేశాడు. ఈ వివాదాస్పద ఔట్ పై ముంబై యాజమాన్యం బీసీసీఐకి పిర్యాదు చేయాలని కొందరు ఫాన్స్ సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • MI vs KKR
  • rohit sharma
  • UltraEdge

Related News

Rohit Sharma

ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

గత ఏడాది రోహిత్ శర్మ చాలా మ్యాచుల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ కనిపించారు. ఫీల్డింగ్ సమయంలో ఆయనకు విశ్రాంతిని ఇచ్చేవారు.

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

Latest News

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd