Mark Zuckerberg Win : జియుజిట్సులో ఇరగదీసిన జుకర్‌బర్గ్.. 2 పతకాలు కైవసం
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. బిజీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్ !! ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీకి ఆయన సీఈవో !! అయినా తన ఆసక్తులకు జీవం పోసేందుకు జుకర్‌బర్గ్ (Mark Zuckerberg Win) అహర్నిశలు శ్రమిస్తున్నారు.
- Author : Pasha
Date : 07-05-2023 - 5:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. బిజీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్ !! ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీకి ఆయన సీఈవో !! అయినా తన ఆసక్తులకు జీవం పోసేందుకు జుకర్‌బర్గ్ (Mark Zuckerberg Win) అహర్నిశలు శ్రమిస్తున్నారు. రోజూ కొంత సమయాన్ని వాటికి కూడా కేటాయిస్తున్నారు. ఆయన తనకెంతో ఇష్టమైన జియు జిట్సులో శ్రమించడమే కాదు.. విజయాన్ని కూడా సాధించి చూపించారు. తొలిసారిగా గెరిల్లా జియు జిట్సు టీమ్ తరఫున టోర్నమెంట్ లో పాల్గొని వివిధ కేటగిరీల్లో బంగారు, వెండి పతకాలను జుకర్‌బర్గ్ (Mark Zuckerberg Win) గెలుచుకున్నారు.
also read : Mark Zuckerberg: మరోసారి తండ్రయిన మెటా సీఈవో జుకర్‌బర్గ్
ఈసందర్భంగా ఆదివారం రోజు తన ఆనందాన్ని ఆయన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరితో పంచుకున్నారు. జియు-జిట్సు టోర్నమెంట్‌లో పాల్గొని పతకాలతో తిరిగి వచ్చానహో అంటూ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఈసందర్భంగా తనకు ట్రైనింగ్ ఇచ్చిన ప్రఖ్యాత జియు జిట్సు ఆటగాళ్లు డేవ్ కమరిల్లో, ఖైవు, ఇంటెన్స్ వన్ కు థాంక్స్ చెప్పారు. ఈ ఫేస్ బుక్ పోస్ట్‌కు ఇప్పటివరకు 1.5 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నట్లు గత సెప్టెంబర్‌లోనే మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించాడు. అప్పట్లో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దానిలో ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ ఖై వుతో కలిసి ఆయన కనిపించారు.