Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Mandhana 63 Spinners Set Dominating Win As Harmanpreet Kaur Co Keep Semi Final Hopes Alive

CWG Cricket: భారత మహిళల చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

కామన్‌వెల్త్‌ గేమ్స్ క్రికెట్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. రెండో లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

  • By Naresh Kumar Published Date - 08:17 PM, Sun - 31 July 22
CWG Cricket: భారత మహిళల చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

కామన్‌వెల్త్‌ గేమ్స్ క్రికెట్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. రెండో లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 99 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో పాక్‌ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. తొలి ఓవర్‌ నుంచే తడబడుతూ సాగింది. ఓపెనర్ మునీబా అలీ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన పాక్ బ్యాటర్లను భారత బౌలర్లు ఎప్పటికప్పుడు కట్టడి చేశారు. చివరి ఓవర్లలో పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం కనబరిచారు. దీంతో ఒత్తిడికి లోనైన పాక్ వరుస వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ రాణా 2 , రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా…రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మకు ఒక్కో వికెట్ దక్కింది.

ఛేజింగ్‌లో దూకుడుగా ఆడిన భారత మహిళల జట్టు కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసింది. షెఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించింది. షెఫాలీ వర్మ 16, మేఘన 14 పరుగులకు ఔటవగా…మంధాన 63, రోడ్రిగ్స్ 2 పరుగులతో జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

ఈ విజయంతో మరోసారి పాక్‌పై భారత్ మరోసారి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై పోరాడి ఓడిన భారత్‌కు టోర్నీలో ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో భారత మహిళల జట్టు సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్ బుధవారం బార్బడోస్‌తో తలపడుతుంది.

Tags  

  • CWG 2022
  • CWG cricket
  • India beta Pakistan
  • indian women cricket
  • Smriti Mandhana
  • team india

Related News

India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

కరేబియన్ టూర్ ను టీమిండియా ఘనంగా ముగించింది. వన్డే సిరీస్ ను గెలిచిన భారత్ తాజాగా టీ ట్వంటీ సీరీస్ లో 4-1 తో విజయం సాధించింది.

  • CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

    CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

  • CWG 2022 : మరోసారి సత్తాచాటిన తెలంగాణ బిడ్డ….భారత్ కు మరో స్వర్ణం..!!

    CWG 2022 : మరోసారి సత్తాచాటిన తెలంగాణ బిడ్డ….భారత్ కు మరో స్వర్ణం..!!

  • CWG Triple Jump: ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం, రజతం.. జావెలిన్‌ త్రోలో కాంస్యం

    CWG Triple Jump: ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం, రజతం.. జావెలిన్‌ త్రోలో కాంస్యం

  • India Hockey: ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు

    India Hockey: ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు

Latest News

  • Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

  • Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!

  • Roja Fire : మామూలు యాంకర్లే కారు కొంటున్నారు…నేను కొంటే తప్పేంటీ..?

  • Red Tongue : ఎర్రటి నాలుకపై పసుపు పొర.. ఇది గుండె జబ్బులకు సంకేతం..!

  • CWG GOLD: అమిత్, నీతూ గోల్డెన్ పంచ్‌

Trending

    • AP Pvt Medical Colleges: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులుం

    • Sausage Star: కొత్త నక్షత్రం అంటూ ఫోటో షేర్ చేసిన శాస్త్రవెత్త.. తీరా అదేంటని చూస్తే?

    • Aadhar Card: కార్డులో ఇలా ఈజీగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోండి.. పూర్తి వివరాలివే!

    • Friendship Day: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

    • Mosquitoes Issue: వర్షాకాలంలో ఈగలు, దోమల బాధపడలేకపోతున్నారా..అయితే శాశ్వతంగా తరిమేసే చిట్కాలివిగో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: