Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ విజయం వెనుక కోచ్ సంగక్కర స్పీచ్..!!
ఐపీఎల్ లో శనివారం మధ్యాహ్నం జరిగిన పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ల రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించించింది.
- By Hashtag U Published Date - 11:36 AM, Sun - 8 May 22

ఐపీఎల్ లో శనివారం మధ్యాహ్నం జరిగిన పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ల రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించించింది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ అర్ధ సెంచరీతో అదరొగట్టాడు. 41 బంతుల్ల 9 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్ కూడా రాణించడంతో రాజస్థాన్ జట్టు విజయం వైపు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 11 మ్యాచ్ ల ద్వారా 14 పాయింట్లు సాధించింది. దీంతో అది మూడో స్థానానికి ఎగబాకింది.
కాగా రాజస్థాన్ రాయల్స్ గెలుపొందిన తర్వాత కోచ్ కుమార సంగక్కర డ్రెసింగ్ రూంలో చాలా సంతోషంగా కనిపించాడు. జట్టు గెలుపొందిన తర్వాత ఐకానిక్ స్టేడియంలో రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్ ను ఉద్దేశించి సంగక్కర ఇలా అన్నాడు. మనకు ఎలా ఆడాలో తెలిసిన పద్దతిలో లేదా మనుకున్న నాణ్యతతో ఆడాలి. మేము వెళ్లి మనకు తెలిసింది చేస్తాము..అభిరుచి, దృక్పథంతో వీలైనంత వరకు రాణించండి…మనం అలా చేసినప్పుడే ఇది టీ20 క్రికెట్ లో లేదా ఏదైనా క్రికెట్ ల సాధ్యమవుతుందని అన్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
కెప్టెన్ సంజు శాంసన్ కూడా డ్రెస్సింగ్ రూంలో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాజ్ అవార్డును గెలుచుకున్న యశస్వి జైస్వాల్ ను ప్రశింసించాడు. యశస్వి 68 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ ఛేజింగ్ కు సహాయపడింది.
Grow through the lows, to glow through the highs. 💗 pic.twitter.com/s7BKusls4x
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2022
Related News

IPL Sixes: ఐపీఎల్ చరిత్రలో సిక్సర్ల రికార్డ్
రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ ను అభిమానులు ఎప్పటిలాగే ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు సాధించింది.