Deepthi Jeevanji : దీప్తి జీవాంజి కు అభినందనలు తెలిపిన కేటీఆర్
అసమాన ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచావని.. ఆడపిల్లలు తమ అసమానమైన శక్తి సామర్థ్యాలతో ఎంతటి ఆనందాన్ని తల్లితండ్రులకు ఇస్తారో ఆడ పిల్ల తండ్రిగా నాకు తెలుసునని
- By Sudheer Published Date - 10:12 PM, Wed - 4 September 24
దీప్తి జీవాంజి (Deepthi Jeevanji)..ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. పారా ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మహిళల 400 మీటర్ల T20లో ఫైనల్‌లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచి ప్రపంచ రికార్డుతో కాంస్య పతకాన్ని (Bronze Medal) సాధించింది తెలంగాణ బిడ్డ దీప్తి. పట్టుదల ముందు మానసిక వైకల్యం ఏమాత్రం పనిచేయదని దీప్తి నిరూపించింది. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు దీప్తిని కొనియాడుతున్నారు. ఇప్పటీకే ప్రధాని మోడీ , రాష్ట్రపతి , పలువురు కేంద్ర మంత్రులు , తెలంగాణ సీఎం రేవంత్ ఇలా ఎంతో మంది దీప్తిని అభినందించారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) సైతం అభినందనలు తెలియజేసారు. అసమాన ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచావని.. ఆడపిల్లలు తమ అసమానమైన శక్తి సామర్థ్యాలతో ఎంతటి ఆనందాన్ని తల్లితండ్రులకు ఇస్తారో ఆడ పిల్ల తండ్రిగా నాకు తెలుసునని.. ఎన్ని కష్టాలున్న సరే దీప్తి తల్లితండ్రులు మాత్రం తన మీద నమ్మకం ఉంచటం గొప్ప విషయమన్నారు. ఆ తల్లితండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ దీప్తి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవటం సంతోషంగా ఉందన్నారు.
వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన ఈమె..చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేది. పుట్టినప్పటి నుంచి మేధస్సు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు, బంధువులు హేళన చేయడం , అవమానించడం ఇలా ఎన్నో చేసేవారు కానీ వారి హేళనలు ఏమాత్రం పట్టించుకోకుండా… కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. దీప్తి విజయాన్ని హర్షిస్తూ ఆమె స్వగ్రామంలో గ్రామస్థులు, పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, స్నేహితులు , జిల్లా వాసులు ఇలా అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు శభాష్..మా ఉరికి ,. మా జిల్లాకు పేరు తెచ్చిందని కొనియాడుతున్నారు.
Deepthi Jeevanji’s bronze in the women’s 400m T20 race at the Paris Paralympics 2024 is a moment of immense pride for Telangana and the entire nation!
As a father of a girl child, I know how daughters bring unparalleled joy and strength. Despite the odds, Deepti’s parents… pic.twitter.com/yzWIKPRIhT
— KTR (@KTRBRS) September 4, 2024
Read Also : Highest Tax-Paying Cricketers : అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రికెటర్ల లిస్ట్… టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ?
Related News
Paris Paralympics 2024: పారాలింపిక్స్.. 25 పతకాల లక్ష్యానికి చేరువలో ఉన్న భారత్..!
భారతదేశం పారిస్ పారాలింపిక్స్‌లో 24 పతకాలను గెలుచుకుంది. ఈ గేమ్‌లకు నిర్దేశించిన 25 పతకాల లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఇది కేవలం ఒక అడుగు దూరంలో ఉంది.