LSG vs DC: పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
- Author : Naresh Kumar
Date : 01-05-2022 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. హుడా, రాహుల్ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్ రాణించారు. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77, దీపక్ హుడా 34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. చివరి వరకూ పోరాడింది. వార్నర్ , పృథ్వి షా విఫలమయినా .. మార్ష్ , పంత్ ధాటిగా ఆడారు. దీంతో ఢిల్లీ గెలుస్తుందనిపించింది. వీరిద్దరూ ఔటైనా పావెల్ కూడా కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు.
చివరి ఓవర్లో 21 రన్స్ అవసరం కాగా.. తొలి బంతికే కుల్‌దీప్ యాదవ్ సిక్స్ కొట్టి లక్నో టీమ్‌ను డిఫెన్స్‌లో పడేశాడు. అయితే తర్వాత స్టాయినిస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేశాడు.
దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 రన్స్ మాత్రమే చేయగలిగింది. పంత్, మార్ష్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్ పోరాడినా.. ఎవరూ మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. అక్షర్ పటేల్ చివరి బంతి వరకూ పోరాడి 24 బంతుల్లో 42 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్ మోహ్‌సిన్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అతడు కీలకమైన డేవిర్ వార్నర్, పంత్, పావెల్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు పడగొట్టాడు.
An elated dugout as @LucknowIPL win by 6 runs against #DelhiCapitals.#TATAIPL #DCvLSG pic.twitter.com/EVagwBHHVA
— IndianPremierLeague (@IPL) May 1, 2022