KL Rahul & Athiya Shetty’s Wedding : కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి ముహూర్తం ఖరారు.. గెస్ట్స్ గా సల్లూ భాయ్, అక్షయ్, కోహ్లీ
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిల పెళ్లి (Wedding) ఖరారైనట్లు తెలుస్తోంది.
- Author : Maheswara Rao Nadella
Date : 12-01-2023 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిల (Athiya Shetty) పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు జరగబోతున్నాయని సమాచారం.జనవరి 21, 22 తేదీల్లో హల్దీ, మెహందీ, సంగీత్ వంటి పెళ్లికి సంబంధించిన వేడుకలు, జనవరి 23న పెళ్లి జరగనుందని అంటున్నారు. దీనిపై కుటుంబ సభ్యులెవరూ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సునీల్ శెట్టికి చెందిన ఖండాలా బంగ్లాలో వివాహం జరగనుందని టాక్.
గెస్ట్స్ ఎవరెవరు?
అథియా , కేఎల్ రాహుల్ (KL Rahul) కుటుంబం , సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లికి సన్నాహాలు మొదల య్యాయని సమాచారం. గెస్ట్స్ జాబితా కూడా సిద్ధమవుతోంది. బాలీవుడ్, క్రికెట్ పప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోనీ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
సోదరుడి అహన్ ప్రీమియర్‌లో కలిసి కనిపించారు:
అథియా శెట్టి సోదరుడు అహన్ శెట్టి కూడా నటుడే. 2021లో అతడి మూవీ “తడప్” ప్రీమియర్ షోలోనూ అతియా, KL రాహుల్ కలిసి కనిపించారు. దీంతో అతియా , కెఎల్ రాహుల్ డేటింగ్ లో ఉన్నారనే టాక్ అప్పట్లో నడిచింది. అంతేకాదు అతియా శెట్టి , కెఎల్ రాహుల్ సోషల్ మీడియాలోనూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి తర్వాత ఇప్పుడు కేఎల్ రాహుల్-అథియాల పెళ్లిని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Delhi Police : నూపుర్ శర్మ దరఖాస్తుపై ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం