Kieron Pollard: 29 బంతుల్లో 65 పరుగులు.. మళ్లీ రెచ్చిపోయిన పొలార్డ్
Kieron Pollard: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025) లో వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ కీరన్ పొలార్డ్ మరోసారి తన సుప్రీం పవర్ హిట్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాల్లో జరుగుతున్న ఫ్రాంచైజీ T20 లీగ్‌లలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు.
- By Kavya Krishna Published Date - 11:00 AM, Wed - 3 September 25

Kieron Pollard: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025) లో వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ కీరన్ పొలార్డ్ మరోసారి తన సుప్రీం పవర్ హిట్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాల్లో జరుగుతున్న ఫ్రాంచైజీ T20 లీగ్‌లలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. సోమవారం రాత్రి సెంట్ కిట్స్ అండ్ నీవిస్ పేట్రియట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఆడిన ఇన్నింగ్స్ అభిమానులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్ ప్రారంభంలో పొలార్డ్ ఇబ్బంది పడ్డాడు. మొదటి 13 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి రన్‌రేట్‌ను పెంచలేకపోయాడు. దీంతో కొంతమంది అభిమానులు ఈ సారి పొలార్డ్ పేలవంగా ఆడతాడేమో అనుకున్నారు. కానీ 15వ ఓవర్ నుంచి దృశ్యం పూర్తిగా మారిపోయింది. స్పిన్నర్ నవీన్ బిడైసీ వేసిన ఓవర్‌లో పొలార్డ్ ధనాధన్ మోడ్‌లోకి మారాడు. మూడో బంతిని స్టాండ్స్‌కి పంపిన ఆయన, ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. తరువాతి ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన వక్వార్ సలామ్ ఖైల్ కూడా పొలార్డ్ విరాబాదుడి ముందు నిలవలేకపోయాడు. వరుసగా నాలుగు బంతులను సిక్స్‌లుగా మలచి మ్యాచ్ వాతావరణాన్ని మార్చేశాడు.
Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు అలాంటి హనీమూన్ కావాలట..కోరిక పెద్దదే !!
అలా కేవలం 8 బంతుల్లోనే 7 సిక్సర్లు బాదిన పొలార్డ్, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులనే కాదు, లైవ్ చూస్తున్న కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించాడు. పొలార్డ్ చివరికి 29 బంతుల్లోనే 65 పరుగులు (7 సిక్సర్లు, 3 ఫోర్లు) చేసి, తన జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్ను విజయతీరాలకు చేర్చాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ట్రిన్బాగో 12 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
పొలార్డ్ ఇన్నింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆయన సిక్స్‌ల వర్షానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది క్రికెట్ ప్రేమికులు, “పొలార్డ్ 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం ఒక తొందరపాటు నిర్ణయం.. ఇప్పటికీ అతను అదే శక్తివంతమైన ఆట ఆడగలడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. పొలార్డ్ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది పవర్ హిట్టింగ్ మాత్రమే. ఆయన కెరీర్‌లో అనేకసార్లు జట్టు గెలవలేని స్థితిలోనూ, అద్భుత ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించాడు. ఇప్పుడు CPL 2025లో మరోసారి అదే దృశ్యం అభిమానులు చూడగలిగారు.
Maratha Quota : మరాఠా కోటాపై మహా సర్కార్ కీలక నిర్ణయం