Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు అలాంటి హనీమూన్ కావాలట..కోరిక పెద్దదే !!
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుండడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది
- By Sudheer Published Date - 08:58 AM, Wed - 3 September 25

ప్రముఖ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పెళ్లి, హనీమూన్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన పెళ్లిని తిరుపతిలో జరిపించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో, సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకను త్వరగా ముగించాలనుకుంటున్నానని చెప్పారు.
పెళ్లి తంతు త్వరగా ముగిసినా, హనీమూన్ మాత్రం చాలా లాంగ్ ఉండాలని కోరుకుంటున్నట్లు జాన్వీ తెలిపారు. ఆమె ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె కోరికను ఆసక్తిగా గమనిస్తున్నారు. జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితంపై తరచుగా వార్తలు వస్తుంటాయి.
Maratha Quota : మరాఠా కోటాపై మహా సర్కార్ కీలక నిర్ణయం
జాన్వీ కపూర్ ప్రస్తుతం వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుండడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో, ఆమె పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. అయితే, ఆమె పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఆమె తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు లో రామ్ చరణ్ సరసన పెద్ది మూవీ లో నటిస్తుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ మూవీ కి డైరెక్ట్ చేస్తున్నాడు.