IPL Franchisee : ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బ్యాడ్ న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలిఉంది.
- By Naresh Kumar Published Date - 02:57 PM, Fri - 11 February 22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలిఉంది. మొత్తం 590 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో ఏ ప్లేయర్ ను ఏ ఫ్రాంచైజీకి ఎంతకు కొంటుంది.. ఎవరిపై కోట్లాది రూపాయల వర్షం కురుస్తుంది అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే మెగా వేలానికి ముందు వార్త ఒకటి ఫ్రాంచైజీలను కలవరపెడుతోంది. ఈ మెగా లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లకు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందుబాటులో ఉండరని తెలుస్తోంద. డేవిడ్ వార్నర్, జోష్ హెజిల్ వుడ్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, మార్క్ స్టొయినిస్ , ఆడం జంపా,లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ ఫస్టాఫ్ సీజన్ కు దూరం కానున్నారని సమాచారం. దీనిపై బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమచారమిచ్చింది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ తెలిపింది. ఇదే తేదీ ఖరారైతే ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఏప్రిల్ 5 వరకు ఆస్ట్రేలియా జట్టు పాకిస్ధాన్ పర్యటనలో ఉంటుంది. ఈ టూర్ లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్ల మధ్య 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ముగిన తర్వాత క్వారంటైన్ లో ఉండి ఐపీఎల్ జట్లతో చేరేందుకు చేరేందుకు దాదాపు పది రోజుల సమయం పడుతుంది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో జరిగే 3 మ్యాచ్ ల వరకూ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఫ్రాంచైజీలకు టెన్షన్ మొదలైంది. జాతీయ జట్టుకు ఆడడం తప్పనిసరి కావడంతో బీసీసీఐ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇదిలావుంటే.. ఐపీఎల్ లోని10 ఫ్రాంచైజీలు మొత్తం 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. శనివారం, ఆదివారం జరగనున్న వేలంలో 590 మంది బరిలో ఉండగా… 217 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి.