Kane Williamson: ఐపీఎల్ నుంచి కేన్ మామ ఔట్
ఊహించిందే జరిగింది.. చెన్నైతో మ్యాచ్ లో గాయపడిన న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన..
- Author : Naresh Kumar
Date : 01-04-2023 - 1:18 IST
Published By : Hashtagu Telugu Desk
Kane Williamson : ఊహించిందే జరిగింది.. చెన్నైతో మ్యాచ్ లో గాయపడిన న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఐపీఎల్ 16వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో కేన్ మామ కాలుకి గాయమైంది. జోషువా లిటిల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్.. మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ కొట్టగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న కేన్ మామ అమాంత గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.
బౌండరీ లైన్ ధాటే క్రమంలో బంతిని లోపలికి విసిరేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక కాలిపైనే ల్యాండ్ అవ్వడం, అది స్లిప్ అవ్వడంతో అలానే కుప్పకూలిపోయాడు. ఆ బంతి కాస్త బౌండరీ లైన్‌ను ధాటింది. కేన్ మామ (Kane Williamson) సూపర్ ఫీల్డింగ్‌కు సిక్సర్ కాస్త బౌండరీగా మారినా.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిలాడిన కేన్ మామ.. ఫిజియో సాయంతో కుంటుతూ మైదానం వీడాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు అప్పుడే అనిపించింది. దీంతో అతడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయిసుదర్శన్ బ్యాటింగ్ వచ్చాడు. అయితే స్కానింగ్ తర్వాత గాయం పెద్దదే అని తేలింది. దీంతో సీజన్ మొత్తానికీ కేన్ మామ దూరమయ్యాడు.
మరోవైపు న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ సైతం కేన్ గాయంపై స్పందించాడు. అతడికి తీవ్ర గాయమైనట్లు స్టెడ్ తెలిపాడు. అతడికి గాయం కావడం జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బని స్టెడ్ పేర్కొన్నాడు. అటు గుజరాత్ టైటాన్స్ కు కూడా గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.