Orange Cap: ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ఉన్నది వీళ్ళే
ఐపీఎల్ 2022 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. మహారాష్ట్రలోని మూడు వేదికల్లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు వరకు 14 మ్యాచ్ లు ముగిశాయి.
- By Naresh Kumar Published Date - 11:11 AM, Thu - 7 April 22
ఐపీఎల్ 2022 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. మహారాష్ట్రలోని మూడు వేదికల్లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు వరకు 14 మ్యాచ్ లు ముగిశాయి. ఈ సారి సీజన్లో కొందరు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఈ క్యాష్ రీచ్ లీగ్ లో 5 సార్లు ట్రోఫీ గెల్చిన ముంబయి ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, ఒక సారి టైటిల్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ లో ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈసారి ఐపీఎల్ లో జొస్ బట్లర్ 3 మ్యాచ్ లలో 102.5 సగటుతో 205 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ 3 మ్యాచ్ లలో 149 పరుగులు చేసాడు. అలాగే ఈ జాబితాలో 3 మ్యాచ్ లలో 122 పరుగులు చేసిన రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ మూడో స్థానంలో ఉండగా.. 121 పరుగులు చేసిన ముంబై ప్లేయర్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ దీపక్ హుడా అయిదో స్థానంలో ఉన్నాడు. హుడా 3 మ్యాచ్ ల్లో 119 రన్స్ చేశాడు. అలాగే 3 మ్యాచ్ లలో 109 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శివం దూబే ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
అటు హిట్ మేయిర్, కే ఎల్ రాహుల్, ఆండ్రూ రస్సెల్ , లివింగ్ స్టోన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక పాయింట్ల పట్టికలో కోల్ కత్తా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన కోల్ కత్తా 3 విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు సాధించింది. రెండేసి విజయాలు అందుకున్న రాజస్థాన్ , గుజరాత్ , పంజాబ్ వరుసగా రెండు, మూడు , నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ అయిదో స్థానంలోనూ , రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఆరో స్థానంలో ఉండగా …ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది.
Related News
RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ […]