Sports Business Awards 2023: బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం
బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం దక్కింది. బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ అవార్డును ఆయన దక్కించుకున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇప్పటి వరకు ఎవరికీ ఇంతటి గౌరవం దక్కలేదు.
- By Praveen Aluthuru Published Date - 10:35 PM, Tue - 5 December 23

Sports Business Awards 2023: బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం దక్కింది. బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ అవార్డును ఆయన దక్కించుకున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇప్పటి వరకు ఎవరికీ ఇంతటి గౌరవం దక్కలేదు. 2023 ఏడాదికి గాను జై షాకు బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా ఎంపిక అయ్యారు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకటించింది. క్రీడారంగానికి సంబంధించిన వ్యాపారంలో నాయకత్వం వహించిన జై షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, డాక్టర్ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. జై షా ఆధ్వర్యంలో ఇటీవల టీమిండియా ప్రపంచకప్ లో అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టింది. వరుసగా పది మ్యాచుల్లో విజయం సాదించింది. జై షా ప్రత్యేక చొరవతోనే మహిళల ఐపీఎల్ పుట్టుకొచ్చింది. ఈయన హయాంలోనే పురుష క్రికెటర్లతో సమాన వేతనాన్ని మహిళా క్రికెటర్లు అందుకుంటున్నారు. ఇలా క్రీడా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చినందుకు గానూ బీసీసీఐ కార్యదర్శి జైషాకు బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్.
Also Read: Chennai Flood: చెన్నైని ముంచెత్తిన వర్షం