Chennai Flood: చెన్నైని ముంచెత్తిన వర్షం
చెన్నైలో వరద ఉదృతి పెరుగుతుంది. అడయార్ నదిలో 40,000 క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తుండటంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 05-12-2023 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
Chennai Flood: చెన్నైలో వరద ఉదృతి పెరుగుతుంది. అడయార్ నదిలో 40,000 క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తుండటంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అడయార్ నది ఒడ్డున ఉన్న పలు ఇళ్లు, భవనాలు కూడా నీట మునిగాయి.
మిగ్జామ్ తుపాను ఆదివారం సాయంత్రం ఉత్తర తమిళనాడు తీరాన్ని దాదాపు 250 కిలోమీటర్ల మేర తాకింది. దూరం చేరుకునే సరికి చెన్నైతో పాటు సబర్బన్ జిల్లాలైన తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురంలో బలమైన గాలులతో వర్షం పడింది. చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. కాగా సెంబరంబాక్కం సహా రిజర్వాయర్ల నుంచి విడుదలైన నీరు కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
అడయార్ నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాల వాసులకు చెన్నై కార్పొరేషన్ సమన్వయంతో పోలీసు శాఖ వరద హెచ్చరిక జారీ చేసింది. అలాగే అడయార్‌లోని తీరప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సెంబరంబాక్కం వద్ద విడుదల చేసిన నీటి కారణంగా చెన్నైలోని వివిధ ప్రాంతాలు వరదలతో నదుల్ని తలపిస్తున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరడంతో అడయార్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో అడయార్ లో 40 వేల క్యూబిక్ ఫీట్ల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.