Rajasthan Wins: రాజస్థాన్ దే సెకండ్ ప్లేస్… చెన్నైకి మరో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్ ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ధోనీ సేన పరాజయం పాలైంది.
- Author : Naresh Kumar
Date : 20-05-2022 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 15వ సీజన్ ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ధోనీ సేన పరాజయం పాలైంది. భారీ స్కోరు దిశగా సాగిన చెన్నై జోరుకు బ్రేక్ వేయడం ద్వారా మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టిక లో రెండో స్థానంలో నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ వచ్చి రావడంతోనే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస పెట్టి బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. అశ్విన్ వేసిన ఐదో ఓవర్ రెండు ఫోర్లు సహా ఓ సిక్సర్ బాదిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్.. తర్వాతి ఓవర్‌లో విధ్వంసమే సృష్టించాడు. బౌల్ట్ వేసిన ఈ ఓవర్‌లో ఐదు ఫోర్లు సహా ఓ సిక్సర్‌తో 26 పరుగులు సాధించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై స్కోర్ 75/1. భారీ షాట్ లతో రెచ్చిపోయిన అలీ 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ఒకవైపు మోయీన్ అలీ ఆడుతున్న మరోవైపు మిగిలిన ఆటగాళ్ళు నిరాశపరిచారు. స్వల్ప వ్యవధిలోనే ఎన్ జగదీశన్ , అంబటి రాయుడు వికెట్లు కోల్పోయిన చెన్నై కష్టాల్లో పడింది. కెప్టెన్ ధోనీ కూడా నిదానంగా ఆడటంతో చెన్నై స్కోరు వేగానికి బ్రేక్ పడింది. ఆరంభంలో ధాటిగా ఆడిన ఈ జట్టు తర్వాత గాడి తప్పింది. ఫలితంగా చెన్నై 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, ఓబెడ్ మెకాయ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ త్వరగానే బట్లర్ వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన బట్లర్.. సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.అయితే జైశ్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు , 1 సిక్స్ తో 59 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ , పడీక్కల్ నిరాశ పరిచినా…బ్యాటింగ్ ఆర్డర్ లో మరోసారి ప్రమోట్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు , 3 సిక్సర్లతో 40 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. హిట్ మయిర్ త్వరగా ఔటయినా…అశ్విన్ , రియన్ పరాగ్ రాజస్థాన్ విజయాన్ని పూర్తి చేశారు. కాగా సీజన్ మొత్తం పేలవ ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ కి ఇది పదో ఓటమి.
Playoffs Qualification ✅
No. 2⃣ in the Points Table ✅Congratulations to the @IamSanjuSamson-led @rajasthanroyals. 👏 👏
Scorecard ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/PldbVFTOXo
— IndianPremierLeague (@IPL) May 20, 2022