HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jackpot For England Players In Mini Auction

మినీ వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు జాక్ పాట్

ఐపీఎల్ మినీవేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతా ఊహించినట్టుగానే స్టార్ ప్లేయర్స్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

  • Author : Anshu Date : 23-12-2022 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asdasdasdasd
Asdasdasdasd

ఐపీఎల్ మినీవేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతా ఊహించినట్టుగానే స్టార్ ప్లేయర్స్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్స్ కోసం గట్టిపోటీ నడిచింది. దీంతో ఇంగ్లీష్ క్రికెటర్లపై కోట్లాభిషేకం కురిసింది. అంచనా వేసినట్టుగానే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ శామ్ కరన్ రికార్డు ధర పలికాడు. ఏకంగా 18.5 కోట్లకు అతను అమ్ముడయ్యాడు.  తద్వారా ఐపీఎల్ చ‌రిత్రలోనే అత్యధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్‌గా రికార్డు నెలకొల్పాడు. గ‌తంలో ఈ రికార్డు సౌతాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ పేరుమీద ఉంది. అప్పుడు మోరిస్ 16.25 కోట్లకు అమ్ముడవగా.. ఇప్పుడు శామ్ కరన్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శామ్ కరన్‌ కోసం ముంబై ఇండియ‌న్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ పోటీ పడి రేటు పెంచాయి. త‌ర్వాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీలోకి రావడంతో చివర్లో అనూహ్యంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా రేసులోకి రావడంతో రేటు 15 కోట్లు దాటిపోయింది. అటు ముంబై ఇండియన్స్ 18 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధమైనా తీవ్రంగా ప్రయత్నించిన పంజాబ్ కింగ్స్‌ 18.50 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది. గత సీజన్‌లో శామ్ కరన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. శామ్ కరన్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ అత్యధిక ధర పలికాడు. అత‌డిని ముంబై ఇండియన్స్‌ ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్‌ను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టిగానే ప్రయత్నించినా.. చివరికి ముంబై జట్టు దక్కించుకుంది.  ఇక ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ కోసం కూడా ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నించాయి. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న స్టోక్స్ కోసం సన్‌రైజర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తీవ్రంగా ప్రయత్నించాయి. చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్ రూ.16.25 కోట్లతో స్టోక్స్‌ను దక్కించుకుంది. అటు విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా మరోసారి భారీ ధర పలికాడు. 2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలో అడుగుపెట్టిన పూరన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో పోటీ పడ్డాయి.చివరి లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.16 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bidding
  • England players
  • IPL
  • sam karan

Related News

IPL 2026

RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

అహ్మదాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు క

  • Ipl 2026

    IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd