Yuzvendra Chahal: చాహల్ ను వదిలేసి ఆర్సీబీ తప్పు చేసిందా ?
ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అనూహ్యంగా కొన్ని జట్లు తడబడుతుంటే...
- By Naresh Kumar Published Date - 12:58 PM, Wed - 6 April 22
ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అనూహ్యంగా కొన్ని జట్లు తడబడుతుంటే… మరికొన్ని విజయాలతో దూసుకుపోతున్నాయి. అయితే అలాంటి వరుస విజయాలతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రేక్ వేసింది. కాగా ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయానికి దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ కారణమడంలో ఎటువంటి సందేహం లేదు. షాబాజ్ అహ్మద్ తో కలిసి రెచ్చిపోయిన డీకే అద్భుతమైన బ్యాటింగ్ తో ఆర్సీబీని గెలిపించాడు. ఇదిలా ఉంటే దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ తో పాటు యజ్వేంద్ర చాహల్ గురించి కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. చాహల్ ను వదిలేసి బెంగళూరు తప్పు చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో చాహల్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
మొదట డుప్లెసిస్ ను ఔట్ చేసిన షాకిచ్చిన చాహల్ తర్వాత కోహ్లీని రనౌట్ చేసి మరో బ్రేక్ త్రూ ఇచ్చాడు. కాసేపటికే డేవిడ్ విల్లీని కూడా పెవిలియన్ పంపి ఆర్సీబీని ఓటమి అంచున నిలబెట్టాడు. ఒక విధంగా డీకే మెరుపు ఇన్నింగ్స్ ఆడకుంటే చాహల్ బౌలింగ్ ప్రదర్శనతో రాజస్థాన్ మరో విజయాన్ని అందుకునేది. ఈ మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ చూసిన తర్వాత పలువురు మాజీలు, బెంగళూరు అభిమానులు ఆర్సీబీ రిటైన్ చేసుకోకుండా వదిలేయడం తప్పు చేసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత సీజన్లలో చాహల్ తన స్పిన్ మ్యాజిక్ తో బెంగళూరును గెలిపించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఈ రికార్డు కారణంగానే వేలంలో అతన్ని ఖచ్చితంగా బెంగళూరు మళ్ళీ తీసకుంటుందని చాలా మంది భావించారు.
అయితే ఆర్సీబీ మాత్రం చాహల్ కోసం కనీసం ప్రయత్నించకపోవడం ఆశ్చర్యపరిచింది. తాను కూడా ఆర్సీబీ తనను వేలంలో కొనుగోలు చేస్తుందని భావించినట్టు చాహల్ చెప్పుకొచ్చాడు. 2022 రిటెన్షన్ సమయంలో జరిగిన కీలక పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును వీడాల్సి వచ్చిందని వాపోయాడు. ఏదిఏమైనా తాను ఐపీఎల్ అరంగేట్రం చేసిన జట్టుకే తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. కాగా, చహల్ తన ఐపీఎల్ కెరీర్లో 117 మ్యాచ్‌ల్లో 146 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద తన పాత జట్టుపై చాహల్ స్పిన్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
Related News
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్‌కు ఉండే క్రేజ్‌ను సాధించింది.