Hardik Pandya: వేరే అమ్మాయితో స్టార్ క్రికెటర్ పాండ్యా..? ఎవరీ మిస్టరీ గర్ల్..?
హార్దిక్ (Hardik Pandya) ఈ అమ్మాయితో ఫోజులిచ్చేటప్పుడు చాలా సంతోషంగా కనిపించాడు.
- By Gopichand Published Date - 07:41 AM, Thu - 11 July 24

Hardik Pandya: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త సోషల్ మీడియాలో దుమారం రేపింది. కొంతకాలంగా వీరి రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఓ మిస్టరీ గర్ల్‌తో క్రికెటర్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు వైరల్‌గా మారాయి. హార్దిక్ (Hardik Pandya) ఈ అమ్మాయితో ఫోజులిచ్చేటప్పుడు చాలా సంతోషంగా కనిపించాడు. ఈ పోస్ట్ చూసిన తర్వాత హార్దిక్ ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి.
హార్దిక్ పాండ్యాతో కనిపించిన మిస్టరీ గర్ల్ ఎవరు?
పాండ్యాతో కనిపించిన అమ్మాయి ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్. ఆమె పేరు ప్రాచీ సోలంకి. ప్రాచీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 546K మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రాచీ ఒక డిజిటల్ సృష్టికర్త. అయితే ఆమె పోస్ట్ ఒకటి రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు డేటింగ్ రూమర్లలో ఎంతవరకు నిజం ఉందనేది కూడా వెలుగులోకి వచ్చింది. ప్రాచీ కేవలం హార్దిక్ పాండ్యా అభిమాని మాత్రమే. తన పోస్ట్‌ను పంచుకుంటూ హార్దిక్‌ని కలిసిన తర్వాత తనకు ఎలా అనిపిస్తుందో ఆమె స్వయంగా చెప్పింది.
రూమర్స్‌లో నిజమెంత?
అయితే ప్రాచీ సోలంకి హార్దిక్‌తో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యా, కృనాల్ భార్య పంఖురితో ఉన్న చిత్రాలను కూడా పంచుకుంది. పాండ్యా ఫ్యామిలీ అంతా ప్రాచీతో చాలా సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ కారణంగా వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు ఇప్పుడు ఊపందుకున్నాయి. మరోవైపు క్రికెటర్ పాండ్యా భార్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే గత కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను అటు హార్దిక్ గానీ ఇటు నటాషా కానీ ఖండించలేదు. అయితే విదేశాల్లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుని వచ్చిన తర్వాత పాండ్యా తన భార్యతో కలిసి దిగిన ఫొటో ఒక్కటీ కూడా పోస్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే కొడుకుతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ సంగీత్ కార్యక్రమానికి కూడా ఒక్కడే వెళ్లటం వీరి మధ్య విడాకుల వార్తలకు బలం చేకూరుస్తుంది.