Priyansh Arya: ప్రియాంష్ ఆర్య వన్‌మ్యాన్ షో.. బౌండరీల మోత.. ఎగిరి గంతులేసిన ప్రతీజింతా.. వీడియో వైరల్
ప్రియాంష్ ఆర్య బౌండరీల మోత మోగిస్తుంటే పంజాబ్ కింగ్స్ యాజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతా ఎగిరి గంతులేశారు.
- By News Desk Published Date - 09:49 PM, Tue - 8 April 25

Priyansh Arya: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా.. ప్రియాంష్ ఆర్య వన్‌మ్యాన్ షో చేశాడు. సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. కేవలం 42 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సులు ఉన్నాయి. ఫలితంగా పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
Also Read: IPL 2025 -Thrilling Match: KKRపై LSG విజయం
ప్రియాంష్ ఆర్య బౌండరీల మోత మోగిస్తుంటే మైదానంలో మ్యాచ్ చూస్తున్న పంజాబ్ కింగ్స్ యాజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతా ఎగిరి గంతులేశారు. ప్రియాంష్ సెంచరీ పూర్తయ్యాక ప్రీతిజింతా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రియాంష్ ఆర్య తన వీరబాధుడుతో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో చేరిపోయాడు. బ్యాటర్లకు స్వర్గదామంగా చెప్పుకునే ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లోనే సెంచరీలు చేసిన బ్యాటర్లు అనేక మంది ఉన్నారు. వీరిలో అగ్రస్థానం క్రిస్ గేల్ దే కావడం విశేషం. గేల్ కేవలం 30 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. గేల్ తర్వాత యూసుప్ పఠాన్, ట్రావిస్ హెడ్, విల్ జాక్స్ వంటి ప్లేయర్లు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. తాజా.. ప్రియాంష్ ఆర్య చేరిపోయాడు.
తాజాగా.. చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య కేవలం 39 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా ప్రియాంష్ రికార్డులకెక్కాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన యూసుఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్ పై కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
THE CELEBRATION FROM PREITY ZINTA AND SHREYAS WHEN PRIYANSH ARYA SCORED A HUNDRED. 🥹❤️pic.twitter.com/cTIJuwxOCe
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2025
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీల బ్యాటర్లు వీరే..
క్రిస్ గేల్ (RCB) – 2013లో పూణె వారియర్స్ పై 30బంతుల్లోనే సెంచరీ చేశాడు.
యూసుఫ్ పఠాన్ (RR) – 2010లో మంబై ఇండియన్స్ పై 37బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
డేవిడ్ మిల్లర్ (KXIP) – 2013లో ఆర్సీబీ జట్టుపై 38 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
ట్రావిస్ హెడ్ (SRH) – 2024లో ఆర్సీబీపై 39బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
ప్రియాంష్ ఆర్య (PBKS) – 2025లో సీఎస్కే జట్టుపై 39బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.