Asian Games : ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని.. బెజవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికిన క్రీడాభిమానులు
ఆసియా క్రీడలు -2023లో పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించి చైనాలోని హాంగ్‌జౌ నుంచి విజయవాడకు తిరిగి వచ్చిన
- By Prasad Published Date - 01:01 PM, Wed - 4 October 23

ఆసియా క్రీడలు -2023లో పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించి చైనాలోని హాంగ్‌జౌ నుంచి విజయవాడకు తిరిగి వచ్చిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో సాకేత్‌కు స్వాగతం పలికేందుకు టెన్నిస్ అసోసియేషన్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, వివేకానంద యువసేన ఆధ్వర్యంలో కారు ర్యాలీ, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొని ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేసిన సాకేత్‌ను అభినందించారు. సాకేత్ తన భాగస్వామి తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. వీరిద్దరూ ఫైనల్స్‌లో చైనా జట్టు చేతిలో ఓడిపోయారు. కృష్ణా జిల్లా టెన్నిస్ సంఘం కార్యదర్శి డాక్టర్ రామ్ కుమార్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నిర్వాహకులు కె. హరి ప్రసాద్, మదన్ కుమార్ తదితరులు సాకేత్‌కు స్వాగతం పలికి అభినందించారు.
We’re now on WhatsApp. Click to Join.
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సాకేత్ మైనేని ఆయన విశాఖపట్నంలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు అభినందనలు తెలిపారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, టెన్నిస్ క్రీడాకారులు, విద్యార్థులు, టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సాకేత్ అంతకుముందు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు USAలో ఐదు సంవత్సరాలు శిక్షణ పొందాడు. అంతర్జాతీయ క్రీడాకారుడు అయ్యాడు. సాకేత్ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకున్నాడు. 2014 ఆసియా క్రీడలలో, 2023లో మరోసారి గోల్డ్ మెడల్ సాధించాడు. భారత ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుతో సాకేత్‌ని సత్కరించింది.
Also Read: Journalists are Terrorists? : జర్నలిస్టులు ఉగ్రవాదులా…?