Ben Stokes: బెన్ స్టోక్స్.. ఆటగాడిగా కాకుండా కోచ్‌గా జట్టులోకి ఎంట్రీ..?
స్టోక్స్ గత ఏడాది కాలంగా బౌలింగ్ చేయలేదని, కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడని బ్రాడ్ చెప్పాడు. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో బెన్ స్టోక్స్‌కు బెటర్ ఆప్షన్ దొరికే అవకాశం కూడా ఉంటుందని బ్రాడ్ చెప్పాడు.
- By Gopichand Published Date - 07:54 AM, Fri - 16 August 24

Ben Stokes: ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఆగస్టు 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయపడి మొత్తం సిరీస్‌కు దూరంగా ఉండటంతో ఇంగ్లండ్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత జట్టు కమాండ్ ఒలీ పోప్‌కు అప్పగించారు. ఇప్పుడు శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో బెన్ స్టోక్స్ తన జట్టుతో కొత్త పాత్రలో చేరబోతున్నాడని పెద్ద సమాచారం బయటకు వస్తోంది.
స్టోక్స్ కోచ్‌గా చేరనున్నాడు
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ శ్రీలంకతో సిరీస్ ఆడడు. అతను ది హండ్రెడ్ సమయంలో స్నాయువు గాయం కారణంగా సిరీస్‌కు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ సమాచారం ఇస్తూ.. స్టోక్స్ కోచ్‌గా మారబోతున్నట్లు ఇప్పటికే మెసేజ్ పంపానని, బ్రెండన్ మెకల్లమ్ ఏం చేయబోతున్నాడో తెలియదా? అని పేర్కొన్నాడు. స్టోక్స్ గత ఏడాది కాలంగా బౌలింగ్ చేయలేదని, కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడని బ్రాడ్ చెప్పాడు. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో బెన్ స్టోక్స్‌కు బెటర్ ఆప్షన్ దొరికే అవకాశం కూడా ఉంటుందని బ్రాడ్ చెప్పాడు.
Also Read: Team India: టీమిండియాకు విదేశీ కోచ్‌ల ఎంట్రీ కలిసొస్తుందా..?
నిజానికి బెన్ స్టోక్స్ ది హండ్రెడ్ లీగ్ సమయంలో నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ తరపున ఆడుతున్నాడు. అతను ఒక మ్యాచ్ సమయంలో స్నాయువు గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను క్రచెస్ సహాయంతో నడుస్తూ కనిపించాడు. స్టోక్స్ గాయం నుండి తిరిగి రావడానికి చాలా సమయం పట్టలేదు. చివరిసారి అతను గాయం కారణంగా IPL 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టోక్స్ మళ్లీ గాయానికి గురయ్యాడు. అయితే ఇటీవల కాలంలో స్టోక్స్ గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఐపీఎల్ 2024కు కూడా దూరమైన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.