Asian Games – Medal : ఆర్చరీ ‘రీకర్వ్’ లో 13 ఏళ్ల తర్వాత భారత్ కు మెడల్
Asian Games - Medal : ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని గెల్చుకుంది. ఆర్చరీ ఈవెంట్ లోని రీకర్వ్ విభాగంలో భారత మహిళా ఆర్చర్ల టీమ్ ఇవాళ ఉదయం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
- By Pasha Published Date - 10:24 AM, Fri - 6 October 23

Asian Games – Medal : ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని గెల్చుకుంది. ఆర్చరీ ఈవెంట్ లోని రీకర్వ్ విభాగంలో భారత మహిళా ఆర్చర్ల టీమ్ ఇవాళ ఉదయం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంకితా భకత్, సిమ్రంజీత్ కౌర్, భజన్ కౌర్‌లతో కూడిన మహిళల టీమ్ వియత్నాం టీమ్ ను ఓడించి శుక్రవారం కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీలో భారత్‌కు ఇది ఏడో పతకం. ఇప్పటివరకు భారత్ ఆర్చరీకి చెందిన మూడు టీమ్స్ గోల్డ్ మెడల్స్ ను సాధించాయి. ఆర్చరీ రీకర్వ్ ఈవెంట్ లో భారత్ కు ఆసియా గేమ్స్ మెడల్ రావడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో రీకర్వ్ విభాగంలో భారత్ చివరిసారిగా వ్యక్తిగత రజతం, పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్‌లలో కాంస్య పతకాలను గెలుచుకుంది.
We’re now on WhatsApp. Click to Join
ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో చైనా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ దేశం 338 మెడల్స్ ను గెల్చుకుంది. వీటిలో 181 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా దేశాలు చెరో 159 మెడల్స్ ను గెల్చుకున్నాయి. జపాన్ 44 గోల్డ్ మెడల్స్ ను గెల్చుకోగా, కొరియా 34 గోల్డ్ మెడల్స్ ను కైవసం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఇప్పటివరకు మొత్తం 87 మెడల్స్ ను దక్కించుకుంది. వీటిలో 21 గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. జనాభాపరంగా చాలా చిన్న దేశం ఉజ్బెకిస్తాన్ పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. అది ఇప్పటివరకు 60 పతకాలను గెల్చుకోగా, వాటిలో 19 గోల్డ్ మెడల్స్ (Asian Games – Medal) ఉన్నాయి.