ICC Test : ఐసీసీ టెస్ట్ టీమ్ లో మనోళ్లు
ఐసీసీ తాజాగా ప్రకటించిన మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ 2021లో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ చోటు సంపాదించుకున్నారు.
- By Hashtag U Published Date - 11:33 AM, Fri - 21 January 22

ఐసీసీ తాజాగా ప్రకటించిన మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ 2021లో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ చోటు సంపాదించుకున్నారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.. గతేడాది రోహిత్ శర్మ 47.68 సగటుతో 906 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వీటిలో ఒకటి సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై చేయగా.. మరోటి విదేశీ గడ్డపై సాధించాడు.
ఇక రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ కూడా గతేడాది అద్భుతంగా రాణించారన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వీరికి ఈ జాబితాలో చోటు కల్పించినట్లు ఐసీసీ పేర్కొంది.. వీరితో పాటుగా ఈ జట్టులో దిముత్ కరుణారత్నె, మార్నస్ లబుషేన్, జోరూట్, ఫవద్ అలమ్,కైల్ జెమీసన్, హసన్ అలీ, షహీన్ అఫ్రిదికి కూడా చోటు దక్కింది…
ఇక అంతకుముందు ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ 2021ను ప్రకటించగా… ఆ జట్టుకి పాక్ సారధి బాబర్ ఆజమ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు…ఈ జట్టులో ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు జన్నెమన్ మలాన్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం బాబర్ ఆజమ్, నాలుగో స్థానంలో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డస్సెన్‌లను ఎంచుకుంది. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హాసన్, ఐర్లాండ్ ఆటగాడు సిమి సింగ్ చోటు దక్కించుకోగా.. వికెట్ కీపర్‌గా బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీం ఏకైక స్పిన్నర్‌గా శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఎంపికయ్యారు.. ఇక పేసర్ల విభాగంలో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్, శ్రీలంక ఆటగాడు దుష్మంత చమీరలను ఐసీసీ ఎంపిక చేసింది.