WI vs IND 2nd Test: ఓవల్ పిచ్ రిపోర్ట్ .. ఆధిపత్యం ఎవరిదంటే..!
డొమినికాలో భారత్ సత్తా చాటింది. టీమిండియా ధాటికి కరేబియన్లు కోలుకోలేకపోయారు. టీమిండియా బౌలింగ్ లోనూ , బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది
- Author : Praveen Aluthuru
Date : 20-07-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
WI vs IND 2nd Test: డొమినికాలో భారత్ సత్తా చాటింది. టీమిండియా ధాటికి కరేబియన్లు కోలుకోలేకపోయారు. టీమిండియా బౌలింగ్ లోనూ , బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. అశ్విన్, జడేజా బంతితో మాయ చేయగా, జైస్వాల్, రోహిత్ భాగస్వామ్యం అద్భుతంగా సాగింది. దీంతో వెస్టిండీస్ భారత్ ని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. మొత్తానికి మొదటి టెస్టులో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇదిలా ఉండగా టీమిండియా వెస్టిండీస్ జట్ల మధ్య ఈ రోజు రెండో టెస్ట్ జరగనుంది. ఓవల్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. అయితే రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది రోహిత్ సేన. మరోవైపు ఒక్క టెస్ట్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటున్నారు కరేబియన్స్.
పిచ్ విషయానికి వస్తే.. ఓవల్ పిచ్ పై బ్యాట్ మేన్స్ ఆధిపత్యం కొనసాగనుంది. ఈ పిచ్ పై భారీ స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువే అంటున్నారు పిచ్ అనలిస్టులు.అయితే గత కొన్నేళ్లుగా ఇదే పిచ్ స్పిన్ బౌలర్‌లకు అనుకూలంగా మారింది. ఇది భారత జట్టుకు కలిసొస్తుందంటున్నారు. ఈ పిచ్ పై సుదీర్ఘమైన ఫార్మాట్‌లో ఇప్పటివరకు మొత్తం 61 మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 20 మ్యాచ్‌లు గెలవగా, బౌలింగ్ జట్టు 18 మ్యాచ్‌లు గెలిచింది. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 302 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 314 పరుగులు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సరదాగా సాగుతుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
Also Read: TDP : మాజీ మంత్రి మాకొద్దంటున్న తెలుగు తమ్ముళ్లు.. నియోజకవర్గంలో కరప్రతాల పంపిణీ