IND vs SL 2nd ODI: చెలరేగిన స్పిన్నర్ జెఫ్రీ, కష్టాల్లో టీమిండియా
రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ విధ్వంసకర బంతులు సంధించాడు. టీమిండియా బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో ఇబ్బంది పెట్టాడు. క్యాచ్ అవుట్, ఎల్బీగా ఒక్కొక్కరిని పెవిలియన్ చేర్చాడు.
- By Praveen Aluthuru Published Date - 08:34 PM, Sun - 4 August 24

IND vs SL 2nd ODI: భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి మ్యాచ్ టై అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తదుపరి రెండు మ్యాచ్‌లు రెండు జట్లకు కీలకం ఎందుకంటే సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే రెండు మ్యాచ్‌లను గెలవాల్సి ఉంది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. లంక 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. రోహిత్, గిల్ అద్భుతంగా రాణించారు. రోహిత్ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. గిల్ 35 పరుగులు చేశాడు. ఇక భారీ అంచనాలతో వచ్చిన కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. కోహ్లీ 14 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత దూబే డకౌట్ అయ్యాడు. ఇక నిరూపించుకోవాల్సిన సమయంలో శ్రేయాస్ అయ్యర్ తడబడ్డాడు.
రెచ్చిపోయిన స్పిన్నర్:
రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ విధ్వంసకర బంతులు సంధించాడు. టీమిండియా బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో ఇబ్బంది పెట్టాడు. క్యాచ్ అవుట్, ఎల్బీగా ఒక్కొక్కరిని పెవిలియన్ చేర్చాడు. ఆరంభం అద్భుతంగా ఉన్న భారత్ ను జెఫ్రీ దెబ్బకొట్టాడు. ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి శ్రీలంకను గట్టెకించాడు. మొదట గిల్‌ను అవుట్ చేసి, ఆ తర్వాత శివమ్ దూబేను ఔట్ చేయడం ద్వారా భారత్ కష్టాల్లో పడింది. జెఫ్రీ కోహ్లీని కూడా అవుట్ చేశాడు.జెఫ్రీ 6 ఓవర్లు వేసి 5 వికెట్లతో సత్తా చాటాడు.
Also Read: Memu Train Accident: పట్టాలు తప్పిన సహరాన్‌పూర్ ప్యాసింజర్