Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄India South Africa Share Series 2 2 After 5th T20i Called Off In Bengaluru Due To Rain

T20 Series Draw: చివరి టీ ట్వంటీకి వరుణుడి దెబ్బ.. సిరీస్ సమం

ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కు నిరాశజనకమైన ముగింపు...ఊహించినట్టుగానే బెంగళూరు మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు.

  • By Naresh Kumar Published Date - 10:30 PM, Sun - 19 June 22
T20 Series Draw: చివరి టీ ట్వంటీకి వరుణుడి దెబ్బ.. సిరీస్ సమం

ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కు నిరాశజనకమైన ముగింపు…ఊహించినట్టుగానే బెంగళూరు మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ రద్దయింది.

టాస్ సరైన సమయానికే పడడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందని అభిమానులు సంబరపడ్డారు. ఆదివారం కావడం, సిరీస్ డిసైడర్ కావడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. మరోసారి పంత్ ను నిరాశకు గురి చేస్తూ టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ పడిన కాసేపటికే వర్షం మొదలైంది.

చాలా సేపటి తర్వాత తగ్గుముఖం పట్టగా.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో సమయం వృథా అయింది. చివరికి 19 ఓవర్లకు మ్యాచ్ ను కుదించడంతో భారత్ బ్యాటింగ్ ఆరంభమైంది. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ 15 పరుగులు చేయడంతో మంచి ఆరంభం లాగే కనిపించింది. అయితే ఏడు పరుగుల తేడాలో ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఔటవడంతో భారత్ 27 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. క్రమంగా భారీ వర్షంగా మారడంతో మ్యాచ్ జరిగేలా కనిపించలేదు.

కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నైనా చూద్దామనుకున్న ఫ్యాన్స్ స్టేడియంలోనే ఆశతో ఎదురుచూశారు. అయితే వరుణుడు శాంతించకపోవడంతో చివరికి మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు. దీంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో సౌతాఫ్రికా గెలిస్తే.. తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా వరుస విజయాలతో సమం చేసింది. భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.

 

🚨 Update 🚨

Play has heen officially called off.

The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV

— BCCI (@BCCI) June 19, 2022

Tags  

  • ‘Pan India’ list of most popular female film
  • 2-2
  • bengaluru
  • India vs africa
  • rains
  • T20 series

Related News

1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

టెస్ట్ సిరీస్ ముగిసింది...ఇక పొట్టి ఫార్మేట్‌లో తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్ సిద్ధమయ్యాయి.

  • Unmanned Combat Aircraft: తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ విమానం.. పరీక్ష సక్సెస్

    Unmanned Combat Aircraft: తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ విమానం.. పరీక్ష సక్సెస్

  • Alert  :   అత్యవసరమైతేనే బయటకు రండి…హైదరాబాదీలకు GHMC హెచ్చరిక..!!

    Alert : అత్యవసరమైతేనే బయటకు రండి…హైదరాబాదీలకు GHMC హెచ్చరిక..!!

  • Weather Update :  ఏపీలో రానున్న‌ ఐదు రోజుల పాటు వర్షాలు..!

    Weather Update : ఏపీలో రానున్న‌ ఐదు రోజుల పాటు వర్షాలు..!

  • Rat Damage : చూడటానికి చిట్టీ ఎలుక.. అది చేసిన పనే రూ.5 లక్షలు పరిహారం కట్టేలా?

    Rat Damage : చూడటానికి చిట్టీ ఎలుక.. అది చేసిన పనే రూ.5 లక్షలు పరిహారం కట్టేలా?

Latest News

  • Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: