INDIA Kabaddi Team: పాకిస్థాన్ చిత్తు.. చిత్తు.. ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన భారత కబడ్డీ జట్టు..!
ఆసియా క్రీడలు 2023లో పురుషుల కబడ్డీ ఈవెంట్‌లో భారత జట్టు (INDIA Kabaddi Team) ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది.
- Author : Gopichand
Date : 06-10-2023 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
INDIA Kabaddi Team: ఆసియా క్రీడలు 2023లో పురుషుల కబడ్డీ ఈవెంట్‌లో భారత జట్టు (INDIA Kabaddi Team) ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 61-14 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023 ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజత పతకం ఖాయమైంది. ఈ మ్యాచ్ ఆరంభం భారత్‌కు కాస్త కష్టంగానే ప్రారంభం అయింది. ఆరంభంలోనే పాక్ నాలుగు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత భారత రైడర్లు, డిఫెండర్లు దూకుడు పెంచడంతో కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్‌ను పాక్ చేతుల్లోంచి చేజార్చుకున్నారు. సగం సమయానికి భారత్ మూడుసార్లు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని 30-5కి పెంచుకుంది.
రెండో అర్ధభాగంలోనూ భారత ఆటగాళ్ల దూకుడు కొనసాగింది. ఈ అర్ధభాగంలో భారత్ మరో మూడుసార్లు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. అంటే మొత్తం మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 6 సార్లు ఆలౌట్ అయింది. కాగా భారత జట్టు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు.
Also Read: Kushboo Support to Roja : మంత్రి రోజా కు సపోర్ట్ గా నిలిచిన సీనియర్ నటి
We’re now on WhatsApp. Click to Join
ఫైనల్‌లో ఇరాన్‌తో తలపడే అవకాశం ఉంది
భారత్ సాధించిన ఈ అద్భుత విజయం తర్వాత కబడ్డీ అభిమానులు సోషల్ మీడియాలో భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం కోసం భారత అభిమానులు కూడా ప్రార్థనలు ప్రారంభించారు. కబడ్డీ రెండో సెమీఫైనల్ ఇరాన్- చైనీస్ తైపీ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత జట్టు స్వర్ణ పతక పోరులో తలపడనుంది. భారతదేశం.. ఇరాన్‌తో పోటీపడే అవకాశాలు ఎక్కువ. కబడ్డీలో ఇరాన్‌కు అనుభవం ఉంది. గత ఆసియా క్రీడల్లో ఇరాన్ ఛాంపియన్ గా నిలిచింది.