Ind Vs SL: తొలిరోజు భారత్ దూకుడు
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Author : Naresh Kumar
Date : 04-03-2022 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద లక్మల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 332 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా 45 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇక తొలిరోజు క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడైన ఆటతీరు కనబరిచిన పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులతో పంత్ దుమ్మురేపాడు.తొలిరోజు టీమిండియా బ్యాటర్లలో 27 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ డిసిల్వా బౌలింగ్‌లో ఎల్బీగా ఔటవ్వగా.. 58 పరుగులు చేసిన హనుమ విహారి.. ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.. ఇక కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అలాగే 29 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కుమార బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరగా.. 33 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు..శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా 2 వికెట్లు పడగొట్టగా.. లక్మల్,ధనుంజయ, ఫెర్నాండో, లాహిరుకుమార ఒక్కో వికెట్ తీశారు.
Photo Courtesy – BCCI/Twitter
Listen in to what Virat Kohli has to say on his playing his landmark Test today. @Paytm #INDvSL | @imVkohli pic.twitter.com/MAtUcgJcVo
— BCCI (@BCCI) March 4, 2022