2027 WTC Final: 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు హోస్ట్‌గా భారత్!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదటి ఫైనల్ 2021లో ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లో జరిగింది. ఆ టైటిల్ ఫైట్‌లో న్యూజీలాండ్ టీమ్ ఇండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. రెండవ ఫైనల్ 2023లో జరిగింది.
- By Gopichand Published Date - 07:39 PM, Fri - 9 May 25

2027 WTC Final: ఇప్పటివరకు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఇంగ్లండ్‌లో జరిగాయి. అయితే 2025 ఫైనల్ (2027 WTC Final) ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరగనుంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఇంగ్లండ్ వెలుపల నిర్వహించాలని చాలాసార్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ఒక మీడియా నివేదికలో భారత్ 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఆతిథ్యం ఇవ్వాలని ఆసక్తి చూపించవచ్చని వెల్లడైంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటోంది. దీని కోసం బిడ్ కూడా వేసింది. బీసీసీఐ ఈ డిమాండ్‌ను గత నెలలో జింబాబ్వేలో జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో లేవనెత్తింది. భారత్ తరఫున ఈ డిమాండ్‌ను అరుణ్ సింగ్ ధూమల్ లేవనెత్తారు. అతను ప్రస్తుతం ఐపీఎల్ ఛైర్మన్ పదవిలో కూడా ఉన్నారు.
Also Read: 300-400 Drones: భారత్‌పై 300-400 డ్రోన్లతో పాక్ భారీ దాడి!
ఇప్పటివరకు ఇంగ్లండ్ ఆతిథ్యం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదటి ఫైనల్ 2021లో ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లో జరిగింది. ఆ టైటిల్ ఫైట్‌లో న్యూజీలాండ్ టీమ్ ఇండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. రెండవ ఫైనల్ 2023లో జరిగింది. దీనిని లండన్‌లోని ది ఓవల్ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి భారత జట్టును ఫైనల్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు మూడవ ఫైనల్ ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. దీనిని కూడా ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పుడు భారత్ డిమాండ్ కారణంగా ఇంగ్లండ్‌లో ఫైనల్స్ జరిగే సంప్రదాయం విరమించవచ్చు. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ గురించి మాట్లాడితే.. భారత్ తన ప్రచారాన్ని ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో ప్రారంభిస్తుంది.