HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Beats Nz To Stay Alive In T20 Series

Ind Vs NZ 2nd T20: లెక్క సరి చేశారు… రెండో టీ ట్వంటీ భారత్ దే

న్యూజిలాండ్ తో లెక్క సరి చేసింది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • Author : Naresh Kumar Date : 29-01-2023 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Players
Team India (4)

Ind Vs NZ 2nd T20: న్యూజిలాండ్ తో లెక్క సరి చేసింది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులకే కట్టడి చేశారు. ఓపెన‌ర్లు ఫిన్ అలెన్‌, డెవాన్ కాన్వే ధాటిగానే న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ఆర‌భించారు.

అయితే వారి జోరుకు భారత స్పిన్నర్లు బ్రేక్ వేశారు. చాహ‌ల్ , కుల్దీప్ యాద‌వ్‌, దీప‌క్ హుడా స్పిన్ ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డారు.కెప్టెన్ శాంట్న‌ర్ 20 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కాగా తొలి టీ20 మ్యాచ్‌లో ధారాళంగా ప‌రుగులు ఇచ్చి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న అర్ష‌దీప్ సింగ్ రెండో టీ20లో మాత్రం ఒకే ఓవ‌ర్ వేసి మూడు ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.చాహ‌ల్ రెండు ఓవ‌ర్లు వేసి నాలుగు ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు. అత‌డితో పాటు హార్దిక్ పాండ్య, దీప‌క్ హుడా, సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్ ల‌కు త‌లో ఒక్క వికెట్ ద‌క్కింది.

100 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ కూడా తడబడుతూ సాగింది. గిల్ 11 , ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13 పరుగులకు ఔటయ్యారు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా నిరాశ పరచడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్య సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో భారత్ 19.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ విజయంతో సీరీస్ ను 1-1 తో సమం చేసింది. సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా బుదవారం జరుగుతుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2nd T20
  • India beat New Zealand
  • India vs New Zealand
  • kuldeep yadav
  • surya kumar yadav

Related News

India vs New Zealand

భారత్‌పై న్యూజిలాండ్ ఘనవిజయం.. 50 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి

నెం.4లో రింకూ సింగ్ ప్రయోగం సాధారణంగా ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రింకూ సింగ్‌ను ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ చేశారు.

  • India vs New Zealand

    న్యూజిలాండ్ భారీ స్కోర్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Latest News

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

  • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

  • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

  • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd