IND vs WI Pitch Report: రెండో టీ20 మ్యాచ్: పిచ్ రిపోర్ట్
ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సేన వెస్టిండీస్ పై ఓటమి చవిచూసింది. అయితే గయానా వేదికగా జరగనున్న రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది టీమిండియా.
- By Praveen Aluthuru Published Date - 09:40 AM, Sun - 6 August 23

IND vs WI Pitch Report: ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సేన వెస్టిండీస్ పై ఓటమి చవిచూసింది. అయితే గయానా వేదికగా జరగనున్న రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది టీమిండియా. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ సిరీస్‌లో రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడతాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఈ మైదానంలో ఒక్కసారి కూడా 200 పరుగులు దాటలేదు. గయానాలోని ఈ మైదానంలో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 27 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగగా, అందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఛేజింగ్ జట్టు గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 122 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 93 పరుగులు మాత్రమే.
తొలి టీ20 ఇంటర్నేషనల్‌లో భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శన పేలవంగా కనిపించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ కూడా చేతులెత్తేసింది. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్ అయినప్పటికీ విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. కేవలం 22 బంతుల్లో 39 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 2 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత యువ బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్ తన పేస్ ఆధారంగా తనదైన ముద్ర వేయగలిగాడు. అదే సమయంలో ముఖేష్ కుమార్ కూడా ఆర్థికంగా బౌలింగ్ చేశాడు. స్పిన్ విభాగంలో కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ జోడీ కరీబియన్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు.
Also Read: Hyderabad: స్కూల్ విద్యార్థినిపై PT సర్ లైంగిక వేధింపులు