Hyderabad: స్కూల్ విద్యార్థినిపై PT సర్ లైంగిక వేధింపులు
- By Praveen Aluthuru Published Date - 09:00 AM, Sun - 6 August 23

Hyderabad: ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ చిన్నారులపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. రోజు ఎదో మూలాన ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యార్థునులపై లైంగిక విధింపుల కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైద్రాబాద్లో ఓ స్కూల్ విద్యార్థినిపై పీటీ సర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణలోని అత్తాపూర్‌లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌పై పోక్సో చట్టం కింద శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SR DG పాఠశాలకు చెందిన PT టీచర్‌పై కేసు నమోదైంది. విద్యార్థినిని ఫోన్‌లో వేధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి విచారణ చేపట్టారు.
Also Read: Minister KTR: వరంగల్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు