Ind Vs SL : ఫీల్డింగ్ పై రోహిత్ అసహనం
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీంఇండియా బోణీ కొట్టింది. లక్నో వేదికగా గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 62 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 04:23 PM, Fri - 25 February 22

సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీంఇండియా బోణీ కొట్టింది. లక్నో వేదికగా గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 62 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇషాన్ కిషన్ 89 పరుగులు , శ్రేయాస్ అయ్యర్ 57 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో శ్రీలంక జట్టు చివరికి 137 పరుగులకే పరిమితమయింది. దాంతో.. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యాన్ని సంపాదించుకోగా.. రెండో టీ ట్వంటీ శనివారం రాత్రి ధర్మశాల వేదికగా జరగనుంది.
అయితే టీమిండియా ఇలా వరుస విజయాల్ని సాధిస్తునప్పటికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం హ్యాపీగా లేనట్లు తెలుస్తోంది.. . తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. శ్రీలంకతో తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో గెలుపొందడం ఆనందంగానే ఉంది. కానీ ఒక్క విషయం నన్నుచాలా టెన్షన్ పెడుతోంది. టీమిండియా ఫీల్డింగ్ అనుకున్నంత స్థాయిలో లేదు. గత కొన్ని మ్యాచ్‌లో సునాయాస క్యాచ్‌లు కూడా వదిలిపెట్టాము. రాబోయే మ్యాచ్‌ల్లో మా ఫీల్డింగ్‌ను పటిష్టంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది..ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ కలిగిన జట్టుగా తయారవ్వాలి అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.