Asia Cup 2023: ఈ రోజు భారత్ పాక్ సూపర్ ఫోర్ మ్యాచ్
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వు డేకి వాయిదా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్లో కోల్పోయి 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది.
- By Praveen Aluthuru Published Date - 06:29 AM, Mon - 11 September 23

Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వు డేకి వాయిదా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది.
ఆదివారం కొలంబోలోని పల్లెకెలె స్టేడియంలో టీమ్ ఇండియా 24.1 ఓవర్లలో 147 పరుగుల వద్ద భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో ఆటను వాయిదా వేయాల్సి వచ్చింది. మిగిలిన మ్యాచ్ ఈ రోజు సోమవారం రిజర్వ్ డేలో జరుగుతుంది. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభమవుతుంది. మ్యాచ్ 50-50 ఓవర్లు ఉంటుంది.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్మాన్ గిల్ (58) పాక్ బౌలర్లపై యుద్ధం ప్రకటించారు. ఎడాపెడా బాదుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి విరాట్ కోహ్లీ (08), కేఎల్ రాహుల్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు.
Also Read: AP : రేపటి టీడీపీ బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ న్యూస్ వైరల్