IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ లో టీమిండియా ట్రాక్ రికార్డ్
IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ స్టేడియం రికార్డులను పరిశీలిస్తే.. భారత్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్‌లు గెలిచి 3 ఓడింది. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2021లో న్యూజిలాండ్‌తో గ్రీన్ పార్క్ స్టేడియంలో టీం ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ కూడా డ్రా అయింది.
- By Praveen Aluthuru Published Date - 04:04 PM, Mon - 23 September 24

IND vs BAN 2nd Test: భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన చెన్నై టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఆతిథ్య టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్‌లోని రెండో టెస్టు (ind vs ban 2nd test) సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌కు ముందు గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమ్ ఇండియా ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో చూద్దాం.
గ్రీన్ పార్క్ స్టేడియం (green park) రికార్డులను పరిశీలిస్తే.. భారత్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్‌లు గెలిచి 3 ఓడింది. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2021లో న్యూజిలాండ్‌తో గ్రీన్ పార్క్ స్టేడియంలో టీం ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ కూడా డ్రా అయింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్‌లతో సహా 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. అన్ని ఫార్మాట్లతో కలిపి భారత్ ఇక్కడ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 18 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఇంకా 13 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 676. ఈ స్కోర్ శ్రీలంకపై భారత్ నమోదు చేసింది.
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలోని పిచ్ (pitch report) స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్లు డే వన్ నుంచి లాభం పొందుతారు. పిచ్ పొడిగా ఉండటం వలన అది స్పిన్నర్లకు కలిసొస్తుంది. ఈ పిచ్ లో బౌన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటుంది. ఇదిలా ఉండగా తొలి టెస్టులో టీమిండియా సమిష్టిగా రాణించి చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ఉచించని విధంగా తొలి టెస్ట్ విధ్వంసం సాగింది. అశ్విన్ సెంచరీతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. పంత్ సెంచరీ చాలా ప్లస్ ఐంది. జడేజా, గిల్ సిరాజ్ ఇలా టీమ్ సమిష్టిగా రాణించి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. అయితే తొలిటెస్టులో కోహ్లీ, రోహిత్ ప్రభావం చూపించలేకపోయారు. అయినప్పటికీ వాళ్లపై ఆ ఇంపాక్ట్ పడలేదు. ఎందుకంటే రికార్డుల్ని బట్టి చూస్తే రెండో టెస్టులో రోహిరాట్ చెలరేగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
Also Read: Kohli IPL Wickets: ఐపీఎల్ లో కోహ్లీ బౌలింగ్, ఎన్ని వికెట్లు తీశాడో తెలుసా?