Ind Vs Aus: తుది జట్టు కూర్పు పై సర్వత్రా ఆసక్తి
ఆసియాకప్ లో ఫ్లాప్ షో తర్వాత టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది.
- Author : Naresh Kumar
Date : 19-09-2022 - 8:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఆసియాకప్ లో ఫ్లాప్ షో తర్వాత టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా రేపు జరగనుంది. ఈ మ్యాచ్ కు భారత తుది జట్టు కూర్పుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆడనున్నారు. ముఖ్యంగా సెంచరీతో చెలరేగిన కోహ్లీపై అందరి చూపు ఉంది. ఇక వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా చాహల్ ఆడటం ఖాయంగా కనిపిస్తుండగా… అక్షర్ పటేల్, అశ్విన్ లలో ఒకరికి చోటు దక్కనుంది.
ఇదిలా ఉంటే గాయాలతో ఆసియాకప్ కి దూరమైన పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరు తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. మెగా టోర్నీకి ముందు వీరిని వీలైనన్ని మ్యాచ్‌లు ఆడించి ఎక్కువ ప్రాక్టీస్ లభించేలా చూడనున్నారు.ఈ ఇద్దరికి తోడుగా భువనేశ్వర్ కుమార్ ఆడటం ఖాయం. సౌతాఫ్రికాతో సిరీస్‌కు భువీకి రెస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జరిగే మూడు మ్యాచ్‌లను భువీ ఆడనున్నాడు. అయితే షమీ కరోనాతో దూరమైన నేపథ్యంలో అతని ప్లేస్ లో ఎంపికయిన ఉమేష్ యాదవ్ కు తుది జట్టులో చోటు కష్టమే. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు జట్టు కూర్పుపై మరింత స్పష్టత రావడమే లక్ష్యంగా ఈ సీరీస్ ఉండనుంది.
తొలి టీ ట్వంటీకి భారత తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్/దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, అక్షర్ పటేల్ / రవిచంద్రన్ అశ్విన్,భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా
💬💬 'Good to have @Jaspritbumrah93 back in the squad' – #TeamIndia captain @ImRo45 #INDvAUS pic.twitter.com/XAKnhgnyoT
— BCCI (@BCCI) September 18, 2022