ICC World Cup 2023: నేటి నుంచి వరల్డ్ కప్ ప్రారంభం.. 10 జట్ల లక్ష్యం ఒకటే..!
ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ప్రారంభానికి ఎక్కువ సమయం లేదు. మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
- By Gopichand Published Date - 06:21 AM, Thu - 5 October 23
ICC World Cup 2023: ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ప్రారంభానికి ఎక్కువ సమయం లేదు. మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌లో ఇది 13వ ఎడిషన్. భారత్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ వివిధ నగరాల్లోని 10 స్టేడియాల్లో జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి?
ఈసారి ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.
ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు..? ఫార్మాట్ ఏమిటి?
మొత్తం ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ దశలో ఒక జట్టు మిగిలిన 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌ల తర్వాత ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచకప్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుండగా, ఫైనల్ నవంబర్ 19న జరగనుంది. అంటే మొత్తం 46 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. అన్ని మ్యాచ్‌లకు రెండు సమయాలను నిర్ణయించారు. డే మ్యాచ్‌లు ఉదయం 10.30 గంటలకు, డే-నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
ఏ వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి?
భారతదేశంలోని 10 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటిలో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల ఉన్నాయి.
Also Read: World Cup 2023: ప్రపంచ కప్ లో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు వెళ్లే..!
We’re now on WhatsApp. Click to Join.
లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడాలి?
ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని Disney + Hotstarలో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్‌లలో మీరు టీవీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
రిజర్వ్ డేలు ఉన్నాయా..?
సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉన్నాయి. రిజర్వ్ డేలు షెడ్యూల్ చేయబడిన మ్యాచ్ తేదీ తర్వాత రోజు నిర్వహిస్తారు.
తక్కువ జట్లతో వరల్డ్ కప్
గత ప్రపంచకప్‌ల కంటే ఈ ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంచారు. మొదటి రెండు ప్రపంచకప్‌లు గెలిచిన వెస్టిండీస్ జట్టు ఈసారి ప్రపంచకప్‌లో భాగం కాకపోవడం అతిపెద్ద విషయం. విండీస్ జట్టు ఈసారి అర్హత సాధించలేకపోయింది.
సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ ఆడతారు?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈసారి హోస్ట్ చేయడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఒంటరిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. గతంలో 1987, 1996, 2011లో దక్షిణాసియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించింది.
Related News
Babar Azam: మరోసారి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా బాబర్ ఆజం..?
పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా విఫలమైన బాబర్ ఆజం (Babar Azam) మరోసారి పాక్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.